Breaking News

‘మైక్రోసాఫ్ట్‌లో డిజిటల్‌ ఆయుధాల తయారీ’

Published on Tue, 04/08/2025 - 13:35

వాషింగ్టన్‌లో ఇటీవల జరిగిన మైక్రోసాఫ్ట్ 50వ వార్షికోత్సవ వేడుకలకు పాలస్తీనా అనుకూల ఉద్యోగులు అంతరాయం కలిగించారు. ఇజ్రాయెల్ సైనిక చర్యల్లో మైక్రోసాఫ్ట్‌ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఇందులో కొందరు రాజీనామా చేశారు. వీరిలో మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగానికి చెందిన ఇండో అమెరికన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ వానియా అగర్వాల్ కూడా ఉన్నారు. గాజాలో హింసాకాండకు ఈ సంస్థ సహకరిస్తోందని ఆరోపిస్తూ మైక్రోసాఫ్ట్‌ను ‘డిజిటల్ ఆయుధాల తయారీదారు’గా అభివర్ణించారు. బహిరంగంగానే రాజీనామా సమర్పిస్తున్నట్లు ప్రకటిస్తూ నినాదాలతో సమావేశం నుంచి బయటకు వచ్చారు.

ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖతో మైక్రోసాఫ్ట్ కుదుర్చుకున్న 133 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని అగర్వాల్ ఖండించారు. కంపెనీ ఏఐ, అజూర్ క్లౌడ్ సేవలు పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ సైనిక చర్యలకు మద్దతుగా నిలిస్తున్నాయని పేర్కొన్నారు. ‘మైక్రోసాఫ్ట్ క్లౌడ్, కృత్రిమ మేధ గాజాలో ఇజ్రాయెల్ సైన్యాన్ని మరింత ప్రాణాంతకంగా, విధ్వంసకరంగా మార్చేందుకు వీలు కల్పిస్తున్నాయి’ అని  అగర్వాల్ కంపెనీకి సమర్పించిన ఈమెయిల్‌లో రాశారు. మైక్రోసాఫ్ట్ టెక్నాలజీని ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థలు, యుద్ధ మౌలిక సదుపాయాలతో ముడిపెట్టిన నివేదికలను ఆమె ఉదహరించారు.

ఇదీ చదవండి: త్వరలో ధరలు పెంపు.. యాపిల్‌ స్టోర్ల వద్ద రద్దీ

అమెజాన్‌లో మూడేళ్లకు పైగా పనిచేసిన తర్వాత 2023 సెప్టెంబర్‌లో మైక్రోసాఫ్ట్‌లో చేరిన అగర్వాల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నారు. పాలస్తీనాకు అనుకూలంగా ఉన్న ఉద్యోగుల్లో అసమ్మతి పెల్లుబుకుతున్న నేపథ్యంలో ఆమె నిరసన తెలపడం తాజాగా చర్చనీయాంశం అయింది. ఫిబ్రవరిలో సీఈఓ సత్య నాదెళ్లతో జరిగిన ఒక సమావేశంలో ఇలాంటి ఆందోళనల కారణంగా అంతరాయం కలగడంతో ఐదుగురు సిబ్బందిని తొలగించారు. ఈ ఆరోపణలపై గానీ, అగర్వాల్ రాజీనామాపై గానీ మైక్రోసాఫ్ట్ ఇంకా బహిరంగంగా స్పందించలేదు.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు