Breaking News

టెలిగ్రామ్‌ సీఈఓ.. ‘దేశం విడిచి వెళ్లకూడదు’

Published on Wed, 05/21/2025 - 13:51

ముందస్తు అనుమతి లేకుండా టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్‌ ఫ్రాన్స్ విడిచి వెళ్లేందుకు అధికారులు నిరాకరించారు. ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌తో చర్చల కోసం అమెరికా వెళ్లాలని దురోవ్ ఇటీవల అధికారులను విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన అభ్యర్థనను పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం తోసిపుచ్చింది.

పొలిటికో తెలిపిన వివరాల ప్రకారం, దురోవ్‌ ప్రతిపాదిత యూఎస్ పర్యటనను ఉటంకిస్తూ ఫ్రెంచ్ ప్రాసిక్యూటర్లు ‘ఈ పర్యటనకు కచ్చితంగా వెళ్లాలనేలా ఎలాంటి కారణాలు లేవు’ అని ఇటీవల తీర్పు ఇచ్చారు. 2024 ఆగస్టులో ఫ్రెంచ్ విమానాశ్రయంలో అరెస్టయినప్పటి నుంచి దురోవ్ ఎదుర్కొంటున్న న్యాయపరమైన అడ్డంకులను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అరెస్టు చేసినప్పటి నుంచి ఆయనను కఠినమైన చట్టపరమైన నియంత్రణలో ఉంచారు. దురోవ్‌ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న టెలిగ్రామ్‌లో జరుగుతున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన తనపై ఆరు క్రిమినల్ అభియోగాలు మోపారు.

ఇదీ చదవండి: ఓలమ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర!

టెలిగ్రామ్ సీఈఓపై వచ్చిన అనేక ఆరోపణల్లో ప్రధానంగా టెలిగ్రామ్‌ను మనీలాండరింగ్, పిల్లలపై లైంగిక వేధింపులు.. వంటివి ఉన్నాయి. రష్యాలో జన్మించిన పారిశ్రామికవేత్త దురోవ్‌కు ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెండింటిలోనూ పౌరసత్వం ఉంది. నిర్దిష్ట అనుమతులు లేకుండా ఫ్రాన్స్ విడిచి వెళ్లడానికి వీల్లేదని నిషేధం విధించారు. ఫ్రాన్స్ అధికారులు 2024 ఆగస్టులో ఫ్రెంచ్ విమానాశ్రయంలో దురోవ్‌ను అరెస్టు చేశారు.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)