Breaking News

ఐదు కంపెనీల ప్రాపర్టీలు వేలం

Published on Wed, 10/16/2024 - 08:37

మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఐదు కంపెనీలకు సంబంధించి 15 ప్రాపర్టీలకు (భూములు/ భవనాలు) నవంబర్‌ 19న వేలం నిర్వహించనుంది. మంగళం ఆగ్రో ప్రొడక్ట్స్, సుమంగళ్‌ ఇండస్ట్రీస్, ఫాల్కన్‌ ఇండస్ట్రీస్‌ ఇండియా, రవికిరణ్‌ రియల్టీ ఇండియా, పురుషోత్తమ్‌ ఇన్ఫోటెక్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీలకు సంబంధించిన ఆస్తులు ఇందులో ఉన్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి ఈ కంపెనీలు వసూలు చేసిన డబ్బులను వేలం ద్వారా రాబట్టబోతున్నట్లు సెబీ తెలిపింది. పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల పరిధిలోని ఈ కంపెనీలకు సంబంధించి ప్రాపర్టీలు, ఫ్లాట్లు, భూములు, ప్లాంట్‌ మెషినరీ వేలం వేయనున్నారు. ఆ ప్రాపర్టీలకు సంబంధించి బిడ్లను సెబీ ఆహ్వానించింది. 15 ప్రాపర్టీల్లో ఏడు మంగళం ఆగ్రో ప్రొడక్ట్స్‌కు సంబంధించినవి ఉన్నాయి. సుమంగళ్‌ ఇండస్ట్రీస్, ఫాల్కన్‌ ఇండస్ట్రీస్‌కు సంబంధించి చెరో మూడు ప్రాపర్టీలు ఉన్నాయి.

ఇదీ చదవండి: మొబైల్‌ తయారీ రంగంలో వేగంగా విస్తరణ

మంగళం ఆగ్రో ప్రొడక్ట్స్‌ నిబంధనలకు విరుద్ధంగా సెక్యూర్డ్‌ ఎన్‌సీడీ(నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌-కంపెనీ అప్పు చెల్లించడంలో డిఫాల్ట్‌ అయితే దాని ఆస్తులు అమ్ముకోవచ్చు)లను జారీ చేసి రూ.11 కోట్లు సమీకరించినట్టు సెబీ తేల్చింది. అలాగే సుమంగళ్‌ ఇండస్ట్రీస్‌ కలెక్టివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీమ్‌ల(వ్యక్తుల నుంచి డబ్బు తీసుకుని విభిన్న మార్గాల్లో పెట్టుబడులు పెట్టడం) ద్వారా రూ.85 కోట్లు, ఫాల్కన్‌ ఇండస్ట్రీస్‌ రెడీమబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్ల(రెడీమ్‌ చేసేకునేందుకు వీలుగా ఉన్న షేర్లు) జారీ ద్వారా రూ.48.58 కోట్ల చొప్పున సమీకరించడం గమనార్హం.

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు