Breaking News

మొదటిసారి ఆదాయపన్ను విధిస్తున్న దేశం

Published on Wed, 06/25/2025 - 12:57

గల్ఫ్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్‌(జీసీసీ) కూటమి దేశాల్లో ఒమన్‌ మొదటిసారి ఆదాయపు పన్నును ప్రవేశపెట్టనుంది. 42,000 రియాల్స్ (1,09,000 డాలర్లు-దాదాపు రూ.93 లక్షలు) కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న వర్గానికి 5% పన్ను విధించనున్నట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఒమన్ న్యూస్ ఏజెన్సీని ఉటంకిస్తూ బ్లూమ్‌బర్గ్‌ కథనం ప్రచురించింది. ఈ విధానం 2028 నుంచి అమల్లోకి రానుందని అంచనా వేసింది.

చమురుకు తగ్గుతున్న డిమాండ్‌

ముడిచమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంపై దేశం తక్కువగా ఆధారపడటానికి ఈ చర్య దోహదపడుతుందని ఒమన్ ఆర్థిక మంత్రి సయ్యద్ బిన్ మొహమ్మద్ అల్ సక్రీ తెలిపారు. అదే సమయంలో ప్రజా సేవలు, సామాజిక అవసరాలపై వ్యయాన్ని సమర్థంగా నిర్వర్తించవచ్చని చెప్పారు. మొత్తం ఆరు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) సభ్యదేశాలు ఆదాయంపై పన్ను విధించకుండా దూరంగా ఉన్న నేపథ్యంలో ఒమన్ తీసుకున్న నిర్ణయం అందుకు భిన్నంగా ఉంది. ఇప్పటివరకు అనుసరిస్తున్న జీరో ట్యాక్స్‌ విధానం అధిక ఆదాయం ఉన్న ప్రవాసులను ఆకర్షించడానికి సహాయపడింది. ఒకవేళ ఒమన్‌ ప్రతిపాదించిన విధానం ఆచరణలోకి వస్తే ప్రవాసుల ధోరణి ఎలా ఉంటుందో గమనించాల్సి ఉంటుంది.

అబుదాబి కమర్షియల్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ మోనికా మాలిక్ ఈ పరిణామాన్ని ఆర్థికంగా కీలకమైనదిగా అభివర్ణించారు. ఒమన్ తన పక్క దేశాలతో అభివృద్ధిలో పోటీ పడేందుకు వీలుగా, రాజీపడకుండా సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యానికి ఇది తోడ్పడుతుందని చెప్పారు. ఇదిలాఉండగా, పొరుగు దేశాల మాదిరిగానే ఒమన్ కూడా సంపద సృష్టించడంలో భాగంగా ఇటీవలి కాలంలో ఆస్తుల అమ్మకాలు, ప్రైవేటీకరణ ద్వారా డబ్బు సమీకరిస్తోంది.

గల్ఫ్ దేశాలు కూడా ఇదే బాటలో..?

సంప్రదాయ శిలాజ ఇంధనాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గుముఖం పడుతుండటంతో ఇతర గల్ఫ్ దేశాలు కూడా ఆదాయపు పన్నును ప్రవేశపెట్టాల్సి ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఇప్పటికే సూచించింది. ప్రస్తుతం చాలా జీసీసీ దేశాలు మెరుగైన ప్రభుత్వ నిధులను కలిగి ఉన్నప్పటికీ సౌదీ అరేబియా, బహ్రెయిన్ మాత్రమే ఈ సంవత్సరం బడ్జెట్ లోటును ఎదుర్కొంటున్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: ఒక్క ఇల్లు.. ఎక్కువ ఈఎంఐలు.. తక్కువ రిటర్న్స్

జీసీసీ దేశాలు ఏవంటే..

గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) అనేది ఆరు మిడిల్‌ ఈస్ట్‌ దేశాలతో కూడిన ఒక ప్రాంతీయ రాజకీయ, ఆర్థిక కూటమి. అందులోని దేశాలు..

  • బహ్రెయిన్

  • కువైట్

  • ఒమన్

  • ఖతార్

  • సౌదీ అరేబియా

  • యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)

1981లో జీసీసీ స్థాపించారు. సౌదీ అరేబియాలోని రియాద్‌లో దీని ప్రధాన కార్యాలయం ఉంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)