Breaking News

త్వరలో వందలో 20 మంది ఉద్యోగుల తొలగింపు

Published on Tue, 06/17/2025 - 16:12

టెక్‌ కంపెనీల్లో ఉద్యోగాల కోత పెరుగుతోంది. ఇప్పటికే చాలా మందికి లేఆఫ్స్‌ ప్రకటించిన ఇంటెల్‌ కంపెనీ జులైలో మరింత మందిని తొలగించాలని యోచిస్తోంది. ఈసారి తొలగింపులు సంస్థ ఫ్యాక్టరీ కార్మికులు 15 నుంచి 20 శాతం మందిని ప్రభావితం చేస్తాయని తెలుస్తోంది. కొత్త సీఈఓ లిప్-బు టాన్ మార్చిలో బాధ్యతలు స్వీకరించిన తరువాత సంస్థ త్వరలో భారీగా శ్రామిక శక్తిని తగ్గించుకోవాలని చూస్తుంది. రాబోయే కోతలు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులను ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇంటెల్ ఫౌండ్రీ కార్యకలాపాలతో సంబంధం ఉన్నవారిపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని చెబుతున్నారు.

నిర్ణయం బాధాకరమైనా తప్పదు

కంపెనీ విడుదల చేసిన అంతర్గత మెమో ప్రకారం ఇంటెల్‌లో కొత్త విడత తొలగింపులు జులై మధ్యలో ప్రారంభమై నెలాఖరు నాటికి ముగిసే అవకాశం ఉంది. ఇంటెల్ చిప్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ చీఫ్ నాగ చంద్రశేఖరన్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఈ నిర్ణయం చాలా బాధాకరమైనది. కానీ పరిశ్రమ సవాళ్లను పరిష్కరించడానికి, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో అవసరం’ అని చెప్పారు.

జాగ్రత్తగా, గౌరవంతో..

ఉద్యోగుల తగ్గింపు శాతంపై ఇంటెల్ నేరుగా వ్యాఖ్యానించనప్పటికీ ఉద్యోగులను ‘జాగ్రత్తగా, గౌరవంతో’ చూస్తామని కంపెనీ పేర్కొంది. వినియోగదారుల అవసరాలకు మెరుగ్గా స్పందించడానికి ఇంజినీరింగ్ బృందాలను శక్తివంతం చేయడానికి విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ మార్పులు ఉన్నాయని తెలిపింది. గణనీయమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో ఇంటెల్‌ ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని ప్రకటించింది. పీసీ, డేటా సెంటర్ మార్కెట్లలో పెరుగుతున్న పోటీ వల్ల కంపెనీ కాస్త వెనుకబడుతుందనే వాదనలున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కూడా అవకాశాలను అందిపుచ్చుకోవడంలేదనే అభిప్రాయాలున్నాయి. ఇంటెల్ 2024లో 15,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇందులో ఒరెగాన్‌లో 3,000 మంది ఉన్నారు.

ఇదీ చదవండి: ప్రభుత్వ బ్యాంకు సారథులతో త్వరలో మంత్రి భేటీ

గట్టిదెబ్బ..

రాబోయే తొలగింపులు ప్రపంచవ్యాప్తంగా ఇంటెల్ కర్మాగారాలపై ప్రభావం చూపనుండగా, సుమారు 20,000 మంది కార్మికులున్న ఒరెగాన్‌లో గట్టిదెబ్బ పడే అవకాశం ఉంది. పెట్టుబడి ప్రాధాన్యతలు, నైపుణ్య మదింపుల ఆధారంగా కోతలకు సిద్ధం కావాలని కంపెనీ ఇప్పటికే విభాగాలను నోటిఫై చేసింది. ఉన్నత యాజమాన్యం అందించిన చట్రంలోనే తొలగింపులను అమలు చేసే విచక్షణాధికారాన్ని ఆయా విభాగాధిపతులకు ఇచ్చినట్లు తెలిసింది.

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?