Breaking News

రాత్రిపూట రైళ్లు ఎందుకు వేగంగా నడుస్తాయి?

Published on Fri, 03/14/2025 - 13:01

కొన్ని రైళ్లు పగలు కంటే రాత్రిపూటే వేగంగా ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తుంది కదా. నిత్యం రైలు ప్రయాణం చేస్తున్నవారు ఇది గమనించే ఉంటారు. ఇది ఒక మిస్టరీగా అనిపించినప్పటికీ దీని వెనుక కారణాలు లేకపోలేదు. కొన్ని ఆసక్తికరమైన, ఆచరణాత్మక కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాత్రిపూట రైలు వేగం పెరగడానికి దోహదపడే కీలక అంశాలను తెలియజేస్తున్నారు.

ట్రాక్ రద్దీ తగ్గుదల

పగటిపూట రైల్వే ట్రాక్‌లు రద్దీగా ఉంటాయి. ప్యాసింజర్ రైళ్లు, సరుకు రవాణా రైళ్లు, ప్రధాన గేట్ల వద్ద పగలు ప్రజల సంచారం వంటి అంశాలతో రైళ్ల రాకపోకలు ఆలస్యం అవుతుంటాయి. పగలు ఇతర రైళ్ల డైవర్షన్‌ కోసం కొన్ని రైళ్లను గంటల తరబడి నిలిపేస్తుంటారు. రాత్రిపూట ఈ ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. దాంతో రైళ్లు వేగంగా నడిచేందుకు వీలుంటుంది.

తక్కువ స్టాప్‌లు

పగటిపూట ప్యాసింజర్ రైళ్లతో పోలిస్తే రాత్రిపూట రైళ్లు, ముఖ్యంగా సుదూర, సరుకు రవాణా సేవలు అందించే రైళ్లకు తక్కువ స్టాపులను షెడ్యూల్ చేస్తారు. దాంతో అంతరాయాలు లేకుండా రైళ్లు వాటి వేగాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది.

డ్రైవర్ విజిబిలిటీ

నైట్ డ్రైవింగ్‌లో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, పగలు రద్దీగా ఉండే స్టేషన్లు లేదా రద్దీగా ఉండే క్రాసింగ్‌లపై లోకోపైలట్లు పెద్దగా దృష్టి కేంద్రీకరించే అవసరం ఉండదు. దాంతో పూర్తిగా డ్రైవింగ్‌, ట్రాక్‌పైనే దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. హై పవర్డ్ హెడ్ లైట్స్, ఆధునిక సిగ్నలింగ్ సిస్టమ్స్ వంటి అధునాతన సాంకేతికత సురక్షితమైన, సమర్థవంతమైన కార్యకలాపాలను నిర్ధారిస్తుంది.

ఇదీ చదవండి: జియోస్టార్‌ యూట్యూబ్‌ కంటెంట్‌ తొలగింపు

షెడ్యుల్‌లో మార్పులు

రైల్వే నెట్వర్క్‌ సామర్థ్యాన్ని పెంచడానికి రాత్రిపూట రైళ్ల షెడ్యుల్‌ను వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తారు. వేగవంతమైన ప్రయాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా పీక్ అవర్స్‌లో ప్రాంతాల మధ్య వస్తువులను రవాణా చేసే సరుకు రవాణా రైళ్ల కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తారు.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)