Breaking News

డిజిటల్‌ మార్కెట్ల నియంత్రణ తక్షణావసరం

Published on Thu, 09/18/2025 - 08:48

డిజిటల్‌ మార్కెట్లలో బడా టెక్‌ కంపెనీలు, పోటీ సంస్థలను దెబ్బతీసే విధానాలను  ఉపయోగించకుండా ముందస్తుగా నివారించేలా ప్రత్యేక విధానాన్ని (ఎక్స్‌–యాంటీ) రూపొందించడం తక్షణావసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను దేశీ అంకుర సంస్థల వ్యవస్థాపకులు కోరారు. డిజిటల్‌ పోటీపై తలపెట్టిన మార్కెట్‌ అధ్యయనం పారదర్శకంగా, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే విధంగా ఉండేలా చూడాలని కోరారు. ఎక్స్‌–యాంటీ నిబంధనలను వ్యతిరేకిస్తూ గ్లోబల్‌ టెక్‌ దిగ్గజాలు దు్రష్పచారం సాగిస్తున్నాయని వివరించారు.

పీపుల్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు అనుపమ్‌ మిట్టల్, మ్యాట్రిమోనీడాట్‌కామ్‌ ఫౌండర్‌ మురుగవేల్‌ జానకిరామన్, ట్రూలీమ్యాడ్‌లీ సహ వ్యవస్థాపకులు స్నేహిల్‌ ఖనోర్, అమిత్‌ గుప్తా తదితరులు ఈ మేరకు నిర్మలా సీతారామన్‌కి లేఖ రాశారు. డిజిటల్‌ మార్కెట్లలో పోటీని అణగదొక్కేలా వ్యవహరిస్తున్న బిగ్‌ టెక్‌ సంస్థల వల్ల స్టార్ట్‌ వ్యవస్థ నిరంతరం సవాళ్లు ఎదుర్కొంటోందని అందులో పేర్కొన్నారు. 

ఎక్స్‌–యాంటీ నిబంధనలను పునఃసమీక్షించడానికి ముందుగా ప్రస్తుత డిజిటల్‌ కాంపిటీషన్‌ బిల్లు ముసాయిదాను ఉపసంహరించి, మార్కెట్‌ను సవివరంగా అధ్యయనం చేయాలన్న ప్రభుత్వ యోచనను తాము స్వాగతిస్తున్నామని స్టార్టప్‌ల ఫౌండర్లు తెలిపారు. అయితే, ఇది స్వతంత్రంగా, పారదర్శకమైన విధంగా జరిగేలా చూడాలని కోరారు.

ఇదీ చదవండి: అంతర్జాతీయంగా ఏఐ నైతిక ప్రమాణాలపై కసరత్తు

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)