Breaking News

ఆకాసా ఎయిర్‌కు రూ.30 లక్షలు జరిమానా.. ఎందుకంటే..

Published on Fri, 10/18/2024 - 12:30

ప్రముఖ విమానయాన సంస్థ ఆకాసా ఎయిర్‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.30 లక్షలు జరిమానా విధించింది. ఎస్‌ఎన్‌వీ ఏవియేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్వహిస్తున్న ఆకాసా ఎయిర్‌ పలు నియంత్రణ ఉల్లంఘనలకు పాల్పడిందని పేర్కొంది. ఈ జరిమానాను ముప్పై రోజుల్లోపు చెల్లించాలని స్పష్టం చేసింది.

ఇంటర్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌(ఐసీఏఓ) ఆధ్వర్యంలోని ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ రెగ్యులేషన్‌ ప్యానల్‌(ఏటీఆర్‌పీ) ఆమోదం లేకుండా పైలట్లకు శిక్షణ ఇస్తున్నట్లు డీజీసీఏ పేర్కొంది. దాంతోపాటు పైలట్ల శిక్షణ సమయం అధికంగా ఉందని చెప్పింది. క్యాట్‌ 2/3 ఆపరేషన్‌(విమానం దిగేందుకు అనుసరిస్తున్న విధానం) కోసం అర్హత లేని ఎగ్జామినర్‌లను నియమించడం వంటివి ఉల్లంఘనల్లో ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి అనేక అవకాశాలు ఇచ్చినప్పటికీ ఆకాసా ఎయిర్ సరైన విధంగా స్పందించలేదని డీజీసీఏ పేర్కొంది. మే 20, 2024న డీజీసీఏ స్పాట్‌ ఇన్‌స్పెక్షన్‌ చేయడంతో ఈ ఉల్లంఘనలు బయటపడినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా? ఈ పాలసీ మీ కోసమే..

ఇప్పటికే ఆగస్టు 29, 2024న జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సంస్థ వివరణ ఇచ్చింది. అయితే దీనిపై డీజీసీఏ సంతృప్తి వ్యక్తం చేయలేదు. దాంతో ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్ 1937లోని రూల్ 162 ప్రకారం రూ.30 లక్షలు జరిమానా విధించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ఆకాసా ఎయిర్ స్పందిస్తూ..‘డీజీసీఏ నుంచి జరిమానా విధించాలంటూ అక్టోబర్‌ 17, 2024న నోటీసు అందింది. సంస్థ ప్రపంచ భద్రత ప్రమాణాలకు కట్టుబడి ఉంది. ఈ విషయంలో డీజీసీఏతో కలిసి పని చేస్తాం’ అని పేర్కొంది. ఒకవేళ కంపెనీ దీనిపై అప్పీల్ చేయడానికి లేదా పెనాల్టీ చెల్లించడానికి 30 రోజుల సమయం ఉంటుంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)