Breaking News

ఇల్లు కొంటే.. గేటెడ్‌ కమ్యూనిటీలోనే కొనాలి!

Published on Sat, 03/07/2026 - 16:17

పని ఒత్తిడితో అలసిసొలసి ఇంటికి వచ్చిన ఉద్యోగికి ప్రశాంతమైన వాతావరణం.. 
నడిచి వెళ్లి వచ్చేంత దూరంలోనే అందుబాటులో ఉండే నిత్యావసరాలు.. 
పిల్లలు హాయిగా ఆకుడునేలా భద్రత.. వృద్ధుల కాలక్షేపం కోసం లైబ్రరీ.. 
కుటుంబ సభ్యులంతా కలిసి సంతోషంగా గడిపేలా పచ్చటి పార్కులు.. 
ఎలాంటి పొల్యూషన్‌ లేని ప్రాంతం.. 
ప్రస్తుతం నగరవాసులు కోరుకుంటున్నవి ఇవే..  

ముఖ్యంగా కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఆలోచనలు, అభిరుచులను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లే విధంగా వాతావరణం ఉంటుంది. అలాంటి అవసరాలు తీరుస్తున్నాయి కాబట్టే ‘గేటెడ్‌ కమ్యూనిటీ’లకు ఆదరణ పెరుగుతూనే ఉంది. కట్టుదిట్టమైన భద్రత, ఆధునిక వసతులు మాత్రమేæకాదు.. మెరుగైన 
జీవనశైలి, ఆరోగ్యకర వాతావరణం, మనశ్శాంతిని అందించే కేంద్రాలే గేటెడ్‌ కమ్యూనిటీలు..    – సాక్షి, సిటీబ్యూరో

భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులు కావడం, ఇద్దరికీ మంచి ప్యాకేజీ ఉండటం, పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని స్టాండలోన్‌  అపార్ట్‌మెంట్ల నుంచి గేటెడ్‌ కమ్యూనిటీలకు షిఫ్ట్‌ అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు.  వాటి ధర అధికంగా ఉన్నా ఏమాత్రం ఆలోచించడం లేదు. 24/7 భద్రత, నిఘా, ఆధునిక వసతులు, మెరుగైన మౌలిక వసతులు ఉండటంతో ఈ తరహా ప్రాజెక్ట్‌ల లో అపార్ట్‌మెంట్లను కొనేందుకు మొగ్గు చూపిస్తున్నారు.

తొలి ప్రాధాన్యత భద్రతకే.. 
ఎవరైనా సరే ఇంటిని ఎంపిక చేసే ముందు ప్రాధాన్యత ఇచ్చేది భద్రతకే. కమ్యూనిటీ లోపలికి ఎవరొస్తున్నారు? ఎవరు వెళ్తున్నారు? అనే కచి్చతమైన సమాచారం ఉంటుంది. గేటెడ్‌ కమ్యూనిటీ గేట్ల వద్ద 24/7 భద్రతా సిబ్బంది, సీసీటీవీ కెమెరాలతో గట్టి నిఘా ఉంటుంది. నివాసితులు అనుమతిస్తే తప్ప బయటివారు లోపలికి వచ్చేందుకు వీలుండదు. దీంతో భార్యభర్తలిద్దరూ ఉద్యోగస్తులైనా పిల్లలు, పెద్దలను ఒంటరిగా ఇంట్లో వదిలి వెళ్లేందుకు ఎలాంటి భయం అక్కర్లేదు. అలాగే గేటెడ్‌లో జిమ్, స్విమ్మింగ్‌ పూల్, మల్టీపర్పస్‌ హాల్, ఇండోర్‌ గేమ్స్, వాకింగ్, సైక్లింగ్‌ ట్రాక్‌లు, ఫిట్‌నెస్‌ సెంటర్, పార్క్, యాంఫీ థియేటర్, ల్యాండ్‌స్కేప్‌ గార్డెనింగ్, స్పోర్ట్స్‌ కోర్ట్‌ క్లబ్‌హౌస్‌ వంటి సౌకర్యాలు ఉంటాయి. రిటైల్‌ దుకాణం, ఫార్మసీ, వెల్‌నెస్‌ సెంటర్‌ కూడా ఉంటాయి.

సామాజిక బంధాలు.. 
సాధారణంగా నగరాలలో పక్కింటి వాళ్లెవరో కూడా తెలియదు అనే భావన ఉంటుంది. కానీ, గేటెడ్‌ కమ్యూనిటీలలో అలా కాదు. నివాసితులందర్నీ ఒక చోట చేరుస్తుంది. వాకింగ్, వ్యాయామం వంటి వేళల్లో ఒకర్ని ఒకరు కలుసుకుంటారు. పిల్లలు వారి వయస్సు స్నేహితులతో ఆడుకుంటారు. పండుగల సందర్భాలలో కమ్యూనిటీ మొత్తం సందడి వాతావరణం నెలకొంటుంది. కమ్యూనిటీ లోపల ధ్వని, వాయు కాలుష్యం ఉండదు. దీంతో నివాసితులు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో నివాసం ఉండే వీలు కలుగుతుంది.

మౌలిక సదుపాయాలు.. 
గేటెడ్‌ కమ్యూనిటీలలో ప్రణాళికాబద్ధమైన మౌలిక సదుపాయాలు ఉండటం వీటి అదనపు ఆకర్షణ.  వెడల్పాటి రోడ్లు, రహదారికి ఇరువైపులా చెట్లు, వృద్ధులు, పిల్లలు సేదతీరేందుకు అక్కడక్కడ బెంచ్‌లు, కుర్చీలు ఉంటాయి. పరిశుభ్రమైన నీటి వ్యవస్థ, భూగర్భ విద్యుత్‌ లైన్లు, మురుగు నీటి వ్యవస్థ ఉంటాయి. ప్రజారవాణా, మెరుగైన మౌలిక వసతులకు చేరువలో ఉంటాయి. నేటి అవసరాలకు తగినట్లు సౌర విద్యుత్, ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ పాయింట్లు అందుబాటులో ఉంటాయి.

అవసరాలు తీరేలా.. 
గేటెడ్‌ కమ్యూనిటీ లే–అవుట్లు కూడా ప్రతి ఇంటికీ మెరుగైన సూర్యరశి్మ, స్వచ్ఛమైన గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్‌ చేస్తారు. అందుకే గేటెడ్‌లో ఎక్కువ స్థలం గ్రీనరీకి కేటాయిస్తారు. కమ్యూనిటీలోని వసతుల నిర్వహణకు క్రమశిక్షణ కలిగిన సిబ్బంది ఉంటారు. నేటి అవసరాలకు అనుగుణంగా కమ్యూనిటీల్లోనే కో–వర్కింగ్‌ స్పేస్, ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ పాయింట్లు, సౌర విద్యుత్‌ వంటివి ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి యువతరం అభిరుచులు, అవసరాలకు తగ్గట్లు గేటెడ్‌ కమ్యూనిటీలను పలువురు బిల్డర్లు ఐటీ పార్క్‌లు, అంతర్జాతీయ స్కూళ్లు, ఆస్పత్రులకు సమీప దూరంలో గేటెడ్‌ కమ్యూనిటీలను నిర్మిస్తున్నారు. సాధారణంగా గేటెడ్‌ కమ్యూనిటీలలో అపార్ట్‌మెంట్ల విస్తీర్ణం 1,300 చ.అ. నుంచి ప్రారంభమవుతాయి. ఆ పరిమాణంలో ఉంటే కనీస వసతులు, జీవనశైలి కల్పించే వీలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

నగరం నలువైపులా.. 
కూకట్‌పల్లి, మదీనాగూడ, తెల్లాపూర్, నల్లగండ్ల, మియాపూర్, బాచుపల్లి, గుండ్లపోచంపల్లి, ఉప్పల్, వనస్థలిపురం, కొంపల్లి, శామీర్‌పేటతో పాటు ఔటర్‌ రింగ్‌ రోడ్డుతో అనుసంధానమై ఉన్న ప్రాంతాలలో గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయి. విశాలమైన స్థలం, వసతులు, నిర్వహణ చార్జీల నేపథ్యంలో గేటెడ్‌ కమ్యూనిటీలో అపార్ట్‌మెంట్ల ధర 20–25 శాతం ఎక్కువగా ఉంటుంది. స్టాండ్‌ ఎలోన్‌ అపార్ట్‌మెంట్లతో పోలిస్తే గేటెడ్‌ కమ్యూనిటీలలో ప్రాపర్టీల విలువ 30–35 శాతం అధికంగా ఉంటుంది. డిమాండ్‌ కారణంగా వీటిల్లో అద్దెలు బాగానే గిట్టుబాటవుతాయి.

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు