Breaking News

రవాణా ఛార్జీలు పెంపు!

Published on Mon, 09/30/2024 - 20:30

ప్రముఖ కొరియర్ సర్వీస్ ప్రొవైడర్ బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ రవాణా ఛార్జీలను పెంచుతున్నట్లు తెలిపింది. 2025 జనవరి 1 నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయని పేర్కొంది. పెరుగుతున్న కార్యాచరణ ఖర్చులు, ద్రవ్యోల్బణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రకటనలో స్పష్టం చేసింది.

కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం..ఎయిర్‌లైన్ నిర్వహణ ఖర్చులు, మౌలిక సదుపాయాలు, ఇన్‌పుట్ ఖర్చులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా దీర్ఘకాలిక వ్యయాలు అధికం అవుతున్నాయి. దాంతో ప్రస్తుతం ఉన్న రవాణా ఛార్జీలను దాదాపు 9-12 శాతం పెంచాలని నిర్ణయించారు. జనవరి 1, 2025 నుంచి ఈ ధరల పెంపు అమలు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బ్లూ డార్ట్ మేనేజింగ్ డైరెక్టర్ బాల్ఫోర్ మాన్యుయెల్ మాట్లాడుతూ..‘వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమస్యల పరిష్కారానికి, వారికి మరింత సమర్థంగా సేవలందించేందుకు ఈ ధరల పెంపు చాలా అవసరం. ఇది కంపెనీ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి, అధునాతన సాంకేతికతలను ఉపయోగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది’ అన్నారు.

ఇదీ చదవండి: యూఎస్‌ వెళ్లేవారికి శుభవార్త! 2.5 లక్షల వీసా స్లాట్లు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)