Breaking News

షాకింగ్.. ఇదే జరిగితే కోకాకోల కథ కంచికే!

Published on Thu, 06/29/2023 - 19:12

ప్రపంచ వ్యాప్తంగా కోకాకోలా గురించి తెలియని వారు ఉండరు అంటే ఏ మాత్రమే అతిశయోక్తి కాదు. ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కోక్ అంటే చాలు ఎగబడిపోతారు. గతంలో ఈ శీతల పానీయాలు చాలా ప్రమాదమంటూ కొన్ని వార్తలు తెరకెక్కాయి, కానీ అవన్నీ బలంగా నిలువలేకపోయాయి. అయితే ఇప్పుడు ఈ సంస్థకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గట్టి షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, కోకాకోలా (CocaCola)లో ఉపయోగించే కృత్రిమ స్వీటెనర్ ఆస్పర్టేమ్ క్యాన్సర్ కారకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దారించనుంది. ఆస్పర్టేమ్ అనే స్వీటెనర్ ప్రపంచ వ్యాప్తంగా చాలా ఉత్పత్తులలో విరివిగా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్వీటెనర్  వల్ల భవిష్యత్తులో క్యానర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. 

తాజాగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన క్యాన్సర్ పరిశోధనల విభాగం ‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) ఈ స్వీటెనర్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని నిర్దారించింది. ఈ కారణంగా కోకాకోలా క్యాన్సర్ కారకం అవుతుందని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం.

(ఇదీ చదవండి: దంపతులిద్దరికీ అదే సమస్య.. వారికొచ్చిన ఐడియా ధనవంతులను చేసిందిలా!)

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ అధికారిక ప్రకటన జులై నెలలో వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే ప్రపంచంలోని చాలా దేశాలు దీని వినియోగాన్ని నిషేధిస్తాయి, మరికొన్ని దేశాలు ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అయితే ఐఏఆర్‌సీ ఈ ఆస్పర్టేమ్ ఎంత మోతాదులో తీసుకుంటే మంచిది, ఎంత మోతాదు దాటితే ప్రమాదం అనే దానికి సంబంధించిన వివరణ ఇవ్వలేదు.

1984లో వెలువడిన కొన్ని నివేదికలు ఆస్పర్టేమ్ తక్కువ మోతాదులో ప్రతి రోజూ తీసుకున్న ఎటువంటి ప్రమాదం లేదని వెల్లడించాయి. ఇన్ని రోజులూ వీటినే అనేక దేశాలు ఉదాహరణలుగా చెబుతూ ముందుకు సాగాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇది క్యాసర్ కారకం అని ప్రకటిస్తే.. ఆ తరువాత పరిణామాలు ఊహాతీతంగా ఉంటాయి.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)