Breaking News

ఐటీ ఉద్యోగ నియామకాల పరిస్థితి ఇదీ..

Published on Thu, 12/05/2024 - 13:57

ముంబై: వైట్‌ కాలర్‌ ఉద్యోగుల (నైపుణ్య, నిర్వహణ విధులు) నియామకాలు  నవంబర్‌ నెలలో 2 శాతం పెరిగాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్, కృత్రిమ మేథ–మెషిన్‌ లెర్నింగ్‌ (ఏఐ/ఎంఎల్‌), ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో నియామకాలు  సానుకూలంగా నమోదయ్యాయి. నవంబర్‌ నెలకు సంబంధించిన గణాంకాలను నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ విడుదల చేసింది.

నౌకరీ ప్లాట్‌ఫామ్‌పై వైట్‌కాలర్‌ ఉద్యోగాలకు సంబంధించి 2,430 నోటిఫికేషన్లు వెలువడ్డాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 2 శాతం పెరిగాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగంలో 16 శాతం, ఫార్మా/బయోటెక్‌ రంగంలో 7 శాతం, ఎఫ్‌ఎంసీజీ రంగంలో 7 శాతం, రియల్‌ ఎస్టేట్‌లో 10 శాతం చొప్పున వైట్‌ కాలర్‌ నియామకాలు  అధికంగా నమోదయ్యాయి. ముఖ్యంగా ఏఐ/ఎంఎల్‌ విభాగంలో 30 శాతం, గ్లోబల్‌ క్యాపబులిటీ సెంటర్లలో 11 శాతం అధికంగా ఉపాధి కల్పన జరిగినట్టు నౌకరీ నివేదిక తెలిపింది.

ఐటీ రంగంలో వైట్‌ కాలర్‌ నియామకాలు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చిచూసినప్పుడు ఎలాంటి వృద్ధి లేకుండా ఫ్లాట్‌గా నమోదైంది. పండుగల సీజన్‌ మద్దతుతో ఇతర రంగాల్లో నియామకాలు మోస్తరుగా ఉన్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే రాజస్థాన్‌ ముందుంది. జైపూర్‌ 14 శాతం, ఉదయ్‌పూర్‌ 24 శాతం, కోటలో 15 శాతం వైట్‌ కాలర్‌ నియామకాలు పెరిగాయి. జైపూర్‌లో విదేశీ ఎంఎన్‌సీ కంపెనీల తరఫున నియామకాలు 20 శాతం పెరిగాయి. భువనేశ్వర్‌లో 21 శాతం వృద్ధి కనిపించింది. 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు