Breaking News

వైట్‌ కాలర్‌ ఉద్యోగాలు పెరిగాయ్‌..!

Published on Sun, 05/03/2026 - 05:25

ముంబై: దేశీయంగా కార్యాలయ ఉద్యోగ నియామకాలు (వైట్‌ కాలర్‌) ఏప్రిల్‌లో పెరిగాయి. గతేడాది ఇదే నెల నియామకాలతో పోల్చి చూస్తే 6 శాతం పెరిగినట్లు నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ నివేదిక వెల్లడించింది. ఇన్సూరెన్స్, ఐటీ ఆధారిత రంగాలు (ఐటీఈఎస్‌) / బిజినెస్‌ ప్రాసెస్‌ ఔట్‌సోర్సింగ్‌ (బీపీఓ), రియల్‌ ఎస్టేట్‌ రంగాలు హైరింగ్‌లో కీలక పాత్ర పోషించాయని నివేదిక పేర్కొంది. ‘‘నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ ప్రకారం 6 శాతం వార్షిక వృద్ధితో, నియామకాలు నిలకడగా కొనసాగుతున్నాయి. ఇన్సూరెన్స్, రియల్‌ ఎస్టేట్, హెల్త్‌కేర్‌ రంగాలు నియామకాల విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 

ఇది ఆయా రంగాల్లో ఉన్న మౌలిక డిమాండ్‌తో పాటు, పెరుగుతున్న వినియోగదారుల కార్యకలాపాలను సూచిస్తోంది. ఐటీ నియామకాలు నిలకడగా ఉన్నప్పటికీ, బ్యాంకింగ్‌ రంగంలో మాత్రం కొంత మందగమనం కనిపిస్తోంది. మొత్తంగా, రంగాల వారీగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ... భారత జాబ్‌ మార్కెట్‌ మాత్రం నిలకడగా ఉంది’’ అని నౌకరీడాట్‌కామ్‌ ఎండీ, సీఈవో హితేష్‌ ఒబెరాయ్‌ తెలిపారు. ‘నౌకరీ డాట్‌కామ్‌’ వెబ్‌సైట్‌లో ఉద్యోగ ప్రకటనలు, ఉద్యోగ సంబంధిత అన్వేషణల ఆధారంగా రూపొందించిన నెలవారీ నివేదిక ప్రకారం....  

→ బీమా రంగం 21 శాతం వృద్ధితో నియామకాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో బీపీఓ/ఐటీఈఎస్‌ (15%), రియల్‌ ఎస్టేట్‌ (12%), హెల్త్‌కేర్‌ (11%), విద్యా రంగం (9%) నిలిచాయి. టెలికామ్, బ్యాంకింగ్‌ రంగాల నియామకాల్లో వరుసగా నాలుగో నెలా క్షీణత నమోదైంది. ఏప్రిల్‌లో ఇవి వరుసగా 11%, 10 శాతం తగ్గాయి. గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్స్‌లో (జీసీసీ) హైరింగ్‌ 4% తగ్గడం గమనార్హం. ఐటీ, ఫార్మా, ఆటో రంగాల నియాకాల్లో పెద్దగా మార్పు లేదు.  

దక్షిణాదిలోనే అధికం: వైట్‌ కాలర్‌ ఉద్యోగ నియామకాల్లో దక్షిణాది మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. హైదరాబాద్‌ 12 శాతం వృద్ధితో టాప్‌లో ఉండగా, బెంగళూరు (7 శాతం), చెన్నై (6 శాతం) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ (3 శాతం) స్వల్ప వృద్ధిని నమోదు చేయగా, కోల్‌కతా (1 శాతం) దాదాపు స్థిరంగా ఉంది. అయితే, ప్రధాన మెట్రో నగరం ముంబైలో హైరింగ్‌ 3% తగ్గింది. 

→ మెట్రోలే కాకుండా, అభివృద్ధి చెందుతున్న నగరాలు జైపూర్‌ (12%), కోయంబత్తూరు (11%), అహ్మదాబాద్‌(7%) సైతం నియామాల్లో బలమైన వృద్ధిని కనబరిచాయి. వైట్‌కాలర్‌ హైరింగ్‌ సంస్కృతి ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరిస్తోంది.

Videos

ఏపీలో పంచాయతీ ఎన్నికల్లేవు.. హైకోర్టుకు తేల్చి చెప్పిన ప్రభుత్వం

నడిపించేది మొత్తం మంగ్లీ..! డబ్బులే డబ్బులు అని నమ్మించి ఇలా చేసింది

బుర్జు ఖలీఫాను మించి ఖర్చు.. దోపిడీకి కేరాఫ్ అమరావతి

ఢిల్లీలో ఘోర ప్రమాదం.. ఏసీ పేలడంతో 9 మంది మృతి

సీరియల్ ఇండస్ట్రీలో నెపోటిజం చాలా అవమానాలు పడ్డా.. ఒకరోజు నాగార్జున కాల్ చేసి..!

ఒకే కుటుంబం ఆఖరి ప్రయాణం. AI వీడియో..

ప్రాణం తీసిన పాపులారిటీ భార్యపై ఈగోతో కొడవలితో హత్య

మార్కెట్లు కుప్పకూలిన జెట్ స్పీడ్ లో దూసుకెళ్లిన స్టాక్

నమ్మించి మోసం చేయడం కాంగ్రెస్ నైజం

ట్యూషన్ వెళ్తున్న బాలుడి కిడ్నాప్ తెలివిగా తప్పించుకుని పేరెంట్స్ కి ఫోన్..

Photos

+5

రోజురోజుకీ మరింత అందంగా కాజల్ అగర్వాల్ (ఫొటోలు)

+5

యాంకర్ రష్మి ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

చరణ్ అతిథిగా మెగా కోడలి సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ సావిత్రి కుమార్తె 21 రోజుల వేడుక (ఫొటోలు)

+5

మిస్ యూనివర్స్ ఇండియా టు హీరోయిన్‌.. ఎవరీ రియా సింఘా? (ఫొటోలు)

+5

తెలంగాణలో గుహ మధ్య అద్భుతమైన ఆలయం (ఫొటోలు)

+5

హైదరాబాద్ : వైద్య విద్యార్థుల ఆనందం చెట్ట‘పట్టా’ల్‌ (ఫొటోలు)

+5

ఏపీ : పలు జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం (ఫొటోలు)

+5

బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రిసెప్షన్‌: ప్రముఖుల సందడి (ఫోటోలు)

+5

ప్రెగ్నెన్సీతో మ్యాడ్ స్క్వేర్‌ బ్యూటీ రెబా మోనికా జాన్ (ఫోటోలు)