Breaking News

వడ్డీరేట్లు తగ్గిస్తే మంచిదే.. మరి నష్టం ఏంటి?

Published on Fri, 06/06/2025 - 11:41

భారతీయ బ్యాంకులు ఇటీవల పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తు​న్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరోసారి తాజాగా 50 బేసిస్‌ పాయింట్లు రెపో రేటు తగ్గించడంతో ఈమేరకు బ్యాంకులు మళ్లీ కీలక వడ్డీ రేట్లను కుదించే వీలుంది. ప్రపంచ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ ఒడిదొడుకులు, ఆర్థిక అనిశ్చితుల మధ్య వృద్ధిని ఉత్తేజపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థలోని కొన్ని అంశాలపై ప్రతికూల ప్రభావం కూడా ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రుణాలు, పెట్టుబడులకు ప్రోత్సాహం

తక్కువ వడ్డీ రేట్లు వ్యక్తులు, వ్యాపారాలకు రుణాలు చౌకగా అందేలా చేస్తాయి. ఇది మౌలిక సదుపాయాలు, తయారీ, ఇతర రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. ఉద్యోగాల సృష్టికి ఊతం ఇస్తుంది. ఆర్థిక విస్తరణకు దారితీస్తుంది. తగ్గిన రుణ ఈఎంఐలు డిస్పోజబుల్ ఆదాయాన్ని(నెలవారీ ఖర్చులుపోను మిగిలిన డబ్బు) పెంచుతాయి. వినియోగదారుల వ్యయాన్ని అధికం చేస్తాయి.

పొదుపుపై ప్రభావం

మరోవైపు పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గుతుండడంతో సంప్రదాయ పొదుపు తగ్గిపోతుంది. దాంతో ఖాతాదారులు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ లేదా రియల్ ఎస్టేట్ వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడులవైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఇవి అధిక నష్టాలను కలిగి ఉంటాయి కానీ, మంచి రాబడిని అందిస్తాయి. ఫైనాన్షియల్ మార్కెట్లను మరింత బలోపేతం చేయగలిగినప్పటికీ, ఇది మార్కెట్ అస్థిరతకు దారి తీయవచ్చు. బ్యాంకుల్లో పొదుపు డబ్బును ఇలా ఇతర మార్గాలవైపు మళ్లించడం బ్యాంకులకు కొంతమేరకు సవాలుగా మారుతుంది.

ఇదీ చదవండి: ఆర్‌బీఐ హ్యాట్రిక్‌ నిర్ణయం.. ఈఎంఐలు తగ్గుతాయ్‌!

ఏం చేయాలంటే..

ఆర్‌బీఐ రెపో రేటుకు అనుగుణంగా భారతీయ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడం రెండువైపులా పదునున్న కత్తితో సమానం. ఇది ఆర్థిక వృద్ధిని, పెట్టుబడులను ప్రేరేపించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ పొదుపుదారులకు, బ్యాంకింగ్ రంగానికి సవాళ్లను మిగులుస్తుంది. ఆర్థిక స్థిరత్వంతో వృద్ధిని సమతుల్యం చేయడానికి ఈ మార్పులు ఎంత సమర్థవంతంగా నిర్వహించబడుతున్నాయనే దానిపై దీర్ఘకాలిక ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఈమేరకు వ్యవస్థలు సమర్థ విధానాలు రూపొందించి అమలు చేయాల్సి ఉంటుంది.

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)