Breaking News

టేకోవర్‌ స్టోరీ: రతన్‌.. ఇక టాటా గ్రూప్‌ పగ్గాలు తీసుకుంటావా?

Published on Thu, 10/10/2024 - 19:17

టాటా గ్రూప్‌ గౌరవ్‌ చైర్మన్‌ రతన్‌ టాటా అస్తమించారు. 86 ఏళ్ల వయసులో ఆయన లోకాన్ని వీడారు. జేఆర్‌డీ టాటా 1991 మార్చిలో టాటా గ్రూప్ పగ్గాలను రతన్ టాటాకు అప్పగించారు. ఆయన నాయకత్వంలో కంపెనీ మరింత పెద్దదైంది. అయితే టాటా గ్రూప్ బాధ్యతలను రతన్ టాటా తీసుకోవాలని జేఆర్‌డీ టాటా ఎలా కోరారో తెలుసా?

టాటా గ్రూప్‌నకు అధినేతగా వ్యవహరించిన ఆయన అసలు టాటా గ్రూప్ పగ్గాలను ఎప్పుడు, ఎలాంటి పరిస్థితిలో చేపట్టారో ఒకసారి ఓ షోలో రతన్‌ టాటా వివరించారు. గుండె సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చేరిన తర్వాత జేఆర్‌డీ టాటా తనకు కంపెనీ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించుకున్నారని వెల్లడించారు.

“మేము ఒక ఫంక్షన్ కోసం జంషెడ్‌పూర్‌లో ఉన్నాం. నేను వేరే పని మీద స్టుట్‌గార్ట్‌కు వెళ్లవలసి వచ్చింది. నేను తిరిగి వచ్చినప్పుడు ఆయనకు(జేఆర్‌డీ టాటా) గుండె సమస్య వచ్చిందని, బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో ఉన్నారని విన్నాను. ఆయన ఒక వారంపాటు అక్కడే ఉన్నారు. నేను రోజూ వెళ్లి చూసొచ్చేవాడిని. ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత రెండు రోజులకు ఆఫీస్‌కి వెళ్లి కలిశాను” అంటూ రతన్ టాటా చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి: టాటా ప్రతీకారం అలా తీరింది..!

"ఆయన్ను(జేఆర్‌డీ టాటా) ఎప్పుడు కలిసినా 'సరే, ఇంకేంటి?' అని అడిగేవారు. జే (జేఆర్‌డీ టాటా) నేను నిన్ను రోజూ చూస్తున్నాను. కొత్తగా ఏముంటుంది? అని నేను చెప్పావాడిని. 'సరే, నేను నీకు కొత్త విషయం  చెప్పాలనుకుంటున్నాను. కూర్చో. జంషెడ్‌పూర్‌లో నాకు జరిగిన సంఘటన (అనారోగ్యం) తర్వాత నేను తప్పుకోవాలనుకుంటున్నాను. (టాటా గ్రూప్‌ చైర్మన్‌గా) నా స్థానం నువ్వే తీసుకోవాలి' అన్నారు. అదే ప్రతిపాదనను బోర్డుకి తీసుకెళ్లారు(కొన్ని రోజుల తర్వాత)” అని టాటా గుర్తుచేసుకున్నారు.

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)