Breaking News

కొత్త కారు కొనే ముందు.. జాగ్రత్తలివి!

Published on Sun, 12/14/2025 - 16:39

కొత్త కారు కొనుగోలు చేయాలని అందరికి ఉంటుంది. అయితే ఇది కొందరికి సాధ్యమవుతుంది. మరికొందరికి కొంత కష్టమే. ఒకవేళా ఎవరైనా కొత్త కారు కొనాలని చూస్తున్నట్లయితే.. తప్పకుండా కొన్ని విషయాలను గమనించాల్సి ఉంటుంది. ఆ విషయాలు, వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.

బడ్జెట్
కారు కొనడానికి ముందు.. ఆలోచించాల్సిందే బడ్జెట్. ఎంత డబ్బు వెచ్చించి కారు కొనాలి. తక్కువ బడ్జెట్లో కావాలా?, ఎక్కువ బడ్జెట్ పెట్టాలా? అనే విషయంపై స్పష్టత ఉండాలి. ఇక్కడ కారు ధర మాత్రమే కాకుండా.. రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్, మెయింటెనెన్స్ ఖర్చులు ఎంత ఉంటాయనే విషయాన్ని కూడా ముందుగానే అంచనా వేసుకోవాలి.

అవసరాలు
కారును ఏ అవసరం కోసం కొంటున్నారనే విషయంపై స్పష్టత ఉండాలి. నగరంలో ప్రయాణించడానికా?, లేక లాంగ్ డ్రైవ్ చేయడానికా? అనే విషయంతో పాటు.. ఫ్యామిలీ కోసమా?, వ్యక్తిగత వినియోగం కోసమా? అనే విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. పెట్రోల్ / డీజిల్ / ఎలక్ట్రిక్ / హైబ్రిడ్ ఏది కావాలో ముందుగానే ఆలోచించండి.

సేఫ్టీ ఫీచర్స్
కారు బడ్జెట్, అవసరాలు వంటి విషయాలతో పాటు.. ఆ కారులో ఉన్న ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్స్ ఏమిటనేది తెలుసుకోవాలి. మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సర్లు / కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్, సేఫ్టీ రేటింగ్ వంటివన్నీ మీరు కొనే కారులో ఉండేలా చూసుకోవాలి.

మైలేజ్ & పర్ఫామెన్స్
దాదాపు అందరూ ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారు కొనాలని ఆలోచిస్తారు. కాబట్టి మంచి మైలేజ్ ఇచ్చే కారు ఏది? దాని పర్ఫామెన్స్ ఎలా ఉందనే విషయాలను ముందుగానే గమనించాలి. ఈ విషయాలను తెలుసుకోవడానికి రియల్-వరల్డ్ మైలేజ్ రివ్యూలు చూడటం మంచిది. ఇంజిన్ పవర్, డ్రైవింగ్ స్మూత్‌నెస్ కూడా పరిశీలించాలి.

మెయింటెనెన్స్ & సర్వీస్
కారు కొనేస్తారు. కానీ దానిని ఎప్పటికప్పుడు సర్వీస్ చేస్తుండాలి. కాబట్టి మీ ప్రాంతంలో సర్వీస్ సెంటర్లు ఉన్నాయా?, లేదా? గమనించాలి. అవసరమైన పార్ట్స్ లభిస్తాయి. సర్వీస్ ఖర్చులు ఎలా ఉంటాయనే విషయాలను ముందుగానే బేరీజు వేసుకోవాలి.

పైన చెప్పినవి మాత్రమే కాకుండా.. వారంటీ (స్టాండర్డ్ + ఎక్స్‌టెండెడ్ వారంటీ) & ఆఫర్లు (ఫెస్టివ్ డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ బోనస్), టెస్ట్ డ్రైవ్, రీసేల్ వాల్యూ, ఇన్సూరెన్స్, డెలివరీకి ముందు తనిఖీ వంటివి కూడా చేయాల్సి ఉంటుంది. మీకు నచ్చిన డిజైన్, అవసరమైన అప్డేటెడ్ ఫీచర్స్ కూడా ఉండేలా చూసుకోవడం మంచిది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)