Breaking News

కొడుకుతో వాచ్‌మెన్‌కు క్షమాపణ చెప్పించిన ముకేశ్‌ అంబానీ

Published on Thu, 10/23/2025 - 16:50

దేశంలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్‌ అంబానీ (Akash Ambani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని లక్షల కోట్ల సంపద ఉన్నా హుందాగా, అణకువగా ఉంటారు. తమ పిల్లలకూ అవే విలువలు నేర్పించారు. పిల్లలు తప్పులు చేసినప్పుడు అవసరమైతే కఠినంగానూ వ్యవహరించారు. ఇలాగే ఓ సందర్భంలో తమ కొడుకు ఆకాశ్ అంబానీతో వాచ్‌మెన్‌కి క్షమాపణ చెప్పించారని మీకు తెలుసా?

ముకేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు లక్షల కోట్ల సంపద ఉన్నా డౌన్ టు ఎర్త్ స్వభావం కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారు. వారు తమ పిల్లలు ఆకాశ్‌ అంబానీ (Akash Ambani), అనంత్‌ అంబానీ, ఇషా అంబానీలో సైతం ఈ విలువలను నింపారు. పిల్లల పెంపకం విషయంలో సాధారణ తల్లిదండ్రుల మాదిరిగానే కఠినంగా వ్యవహరించారు.

వాచ్‌మెన్‌కు క్షమాపణ చెప్పిన ఆకాశ్ అంబానీ

ముఖేష్ అంబానీ ఒకసారి తన పెద్ద కొడుకు ఆకాశ్‌ అంబానీతో వాచ్‌మెన్‌కి క్షమాపణ చెప్పించారు. సిమి గరేవాల్ షోలో పేరెంటింగ్ విధానాల గురించి చర్చ సందర్భంగా నీతా అంబానీ ఆ సంఘటన గురించి పంచుకున్నారు. ఓసారి ఆకాశ్ బిల్డింగ్ వాచ్‌మెన్‌తో ఫోన్‌లో చాలా దురుసుగా మాట్లాడుతున్నాడు. దీన్ని గమనించిన ముకేశ్‌ అంబానీ వెంటనే ఆశాశ్‌ను మందలించినట్లుగా నీతా అంబానీ వెల్లడించారు.

అంతటితో ఆగకుండా కొడుకు ఆకాశ్‌ను కిందకు తీసుకువెళ్లి ఆ వాచ్‌మెన్‌కు క్షమాపణ చెప్పించారు. ఈ విషయంలో ముకేశ్‌ పేరెంటింగ్ స్టైల్ చాలా కఠినంగా ఉందని నీతా వివరించారు. వారి సామాజిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూడాలని ముకేశ్‌ తన పిల్లలకు స్పష్టంగా బోధించారని తెలిపారు. అంబానీ కుటుంబంలో భాగమైనంత మాత్రాన తన పిల్లలను ఎప్పుడు హద్దు దాటనీయలేదని నీతా చెప్పుకొచ్చారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)