Breaking News

ఫోన్‌లో సిమ్‌ లేకుంటే వాట్సాప్‌ బంద్‌!

Published on Sun, 11/30/2025 - 10:28

వాట్సాప్, టెలిగ్రామ్‌ వంటి మెసేజింగ్ యాప్‌లను కొంత మంది సిమ్‌ లేకపోయినా వాడుతుంటారు. ఇకపై అలా కుదరదు. ఫోన్‌లో యాక్టివ్‌ సిమ్‌ ఉంటేనే ఆ యాప్‌లు పనిచేస్తాయి. యాప్‌ ఆధారిత కమ్యూనికేషన్‌ సర్వీసులు అంటే వాట్సాప్‌, సిగ్నల్‌, టెలిగ్రామ్‌ వంటివి క్రియాశీల సిమ్ కార్డుకు నిరంతరం అనుసంధానమై ఉంటేనే పనిచేసేలా కేంద్ర ప్రభుత్వం ఆయా యాప్‌ సంస్థలకు ఆదేశాలు జారీచేసింది.

గత నవంబర్ చివరలో టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) జారీ చేసిన కొత్త సైబర్ సెక్యూరిటీ నిబంధనల్లో ఇది భాగం. ఈ మార్పులను అమలు చేస్తూ సమ్మతి నివేదికలను సమర్పించడానికి సర్వీస్‌ ప్రొవైడర్లకు టెలికమ్యూనికేషన్స్ విభాగం 90 నుంచి 120 రోజుల సమయం ఇచ్చింది.

సిమ్ లింకేజీ తప్పనిసరి 
ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం ఆదేశాల ప్రకారం.. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్‌చాట్‌, అరట్టై వంటివాటితోపాటు జియోచాట్, షేర్‌చాట్ వంటి స్థానిక ​​​​​​కమ్యూనికేషన్‌ యాప్‌లు కూడా వాటిని ఉపయోగిస్తున్న డివైజ్‌లలొ యాక్టివ్‌ సిమ్ కార్డు ఉంటేనే పనిచేయాలి.

ఇ​​క వాట్సాప్‌, టెలిగ్రామ్‌ వెబ్‌ వర్షన్లను కూడా చాలా మంది ఉపయోగిస్తుంటారు. వాటి వినియోగానికి సంబంధించి కూడా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం.. వాట్సాప్‌, టెలిగ్రామ్‌ వెబ్‌ సర్వీసులు ఏకధాటిగా పనిచేయవు. ప్రతి ఆరు గంటల​​కోసారి మొబైల్‌ను ఉపయోగించి లాగిన్‌ కావాల్సి ఉంటుంది.

ఇప్పటి వరకు, చాలా యాప్‌లు ఇన్‌స్టాలేషన్ సమయంలో మాత్రమే యూజర్‌ మొబైల్‌ నంబర్‌ను ధ్రువీకరించేవి. కొత్త నిబంధనల ప్రకారం, యూజర్‌ ఇచ్చే మొబైల్‌ నంబర్‌ నిరంతరం క్రియాశీలకంగా లింక్ చేయబడి ఉండాలి.

ఎందుకీ కొత్త నిబంధన?
రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించిన సిమ్ పక్కన పడేసినా లేదా ఇనాక్టివ్‌ అయినా కూడా ఆయా యాప్‌లు పనిచేస్తూనే ఉన్నాయి. ఈ లొసుగును సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీన్ని అరికట్టడానికే ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం ఈ కొత్త నిబంధన తీసుకొచ్చింది.

ఇదీ చదవండి: మార్కెట్లోకి ఐక్యూ కొత్త ఫోన్‌.. ట్రిపుల్‌ 50MP కెమెరా.. 7000mAh బ్యాటరీ

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)