Breaking News

వాట్సాప్‌ యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్‌: ఒకేసారి 32 మందితో

Published on Thu, 06/29/2023 - 11:19

కొత్త, కొత్త  ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న ప్రముఖ మెసెంజర్ వాట్సాప్‌  మరోకొత్త ఫీచర్‌ను ప్రకటించింది. తాజా అప్‌డేట్‌ ప్రకారం వాట్సాప్‌ వినియోగదారులు పీసీలో ఏకంగా గరిష్టంగా 32 మందితో ఒకేసారి వీడియో కాల్స్ చేసుకోవచ్చు. బీటాలో 32 మంది పార్టిసిపెంట్స్‌తో వీడియో కాల్స్‌ను చేసుకునే ఫీచర్‌ను లాంచ్‌ చేసింది. అంటే ఇకపై గూగుల్‌ మీట్‌, జూమ్‌ లాంటి అవసరం లేకుండానే ఒకేసారి 32మందితో వీడియో ద్వారా  డెస్క్‌ టాప్‌ ద్వారా సంభాషించవచ్చు.  (టాప్‌ డైరెక్టర్‌ రాజమౌళి కొత్త అవతార్‌: హీరోలకు షాకే!?)

వాబేటా ఇన్ఫో ప్రకారం 32 మంది యూజర్లు వీడియోకాల్స్‌ చేసుకోవచ్చు. గ్రూపు కాల్స్‌లో జాయిన్‌ కమ్మని వచ్చే ఇన్విటేషన్‌ మెసేజ్‌ ద్వారా కావాలనుకున్నబీటా యూజర్లు ఈ వీడియో కాల్‌లో జాయిన్‌  కావచ్చు. విండోస్ అప్‌డేట్ కోసం సరికొత్త వాట్సాప్ బీటాను ఇన్‌స్టాల్ చేసే కొంతమంది బీటా టెస్టర్లకు ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని నివేదిక పేర్కొంది.

విండోస్ వినియోగదారులు ఇప్పటివరకు 32 మంది వ్యక్తులతో మాత్రమే ఆడియో వాట్సాప్ కాల్స్‌ చేసుకోగలిగేవారు.  అయితే ఇప్పుడు తాజా అప్‌డేట్‌తో బీటా యూజర్లు గరిష్టంగా 32 మందితో వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు. గత ఏడాది నవంబరులోనే మెటా ఫౌండర్‌, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఆండ్రాయిడ్ , ఐఓఎస్‌లో ఈ  ఫీచర్‌ అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. ఈ నెల ప్రారంభంలో, మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ విండోస్‌లోని కొంతమంది బీటా టెస్టర్‌లకు వీడియో కాల్‌ల కోసం స్క్రీన్-షేరింగ్ ఫీచర్‌ను  ప్రకటించిన సంగతి తెలిసిందే.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)