Breaking News

ఈ ఫోన్‌లలో వాట్సాప్ పనిచేయదు!

Published on Sun, 06/01/2025 - 07:40

ఒకటో తేదీ వచ్చిందంటే.. దాదాపు చాలా రూల్స్ మారిపోతాయి. క్రెడిట్ కార్డుల దగ్గర నుంచి గ్యాస్ ధరల వరకు.. చాలా మార్పులు వస్తుంటాయి. ఇప్పుడు తాజాగా ఈ రోజు (జూన్ 1) నుంచి కొన్ని ఐఫోన్‌లు & ఆండ్రాయిడ్ పరికరాల్లో వాట్సాప్ పనిచేయడం ఆగిపోతుంది. ఈ చర్య 2025 మే 1వ తేదీ నుంచే అమల్లోకి రావాల్సి ఉంది. కానీ కొంచెం ఆలస్యం కావడంతో.. వినియోగదారులు తమ ఫోన్‌లను మార్చుకోవడానికి సమయం దొరికింది.

వాట్సప్‌కు సపోర్ట్ చేయని మొబైల్స్..
➤ఐఫోన్ 5ఎస్
➤ఐఫోన్ 6
➤ఐఫోన్ 6 ప్లస్
➤ఐఫోన్ 6ఎస్
➤ఐఫోన్ 6s ప్లస్
➤ఐఫోన్ ఎస్ఈ (ఫస్ట్ జనరేషన్)
➤శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4
➤శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3
➤సోనీ జెడ్‌పీరియా జెడ్1
➤ఎల్‌జీ జీ2
➤హువావే అసెండ్ పీ6
➤మోటో జీ (ఫస్ట్ జనరేషన్)
➤మోటరోలా రేజర్ హెచ్‌డీ
➤మోటో ఈ 2014

జాబితాలోని అన్ని ఫోన్‌లు చాలా పాత వెర్షన్‌లు. అయితే కొన్ని ఫోన్‌లలో సాఫ్ట్‌వేర్ అప్డేట్ సాధ్యమైతే.. వాట్సప్‌ పనిచేసే అవకాశం ఉంది.

ఫోన్‌లలో వాట్సాప్ పనిచేయకపోవడానికి ప్రధాన కారణం.. భద్రతా ప్రమాణాలే అని తెలుస్తోంది. యాపిల్ ఇకపై పాత iOS వెర్షన్‌లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అందించదు. కాబట్టి ఈ పరికరాల్లో భద్రత లోపిస్తుంది. భద్రతా లోపం సమస్యలను తీసుకొచ్చే ప్రమాదం ఉంది.

ఇదీ చదవండి: జీవితాన్ని నాశనం చేసే పదం ఇదే: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక

గత కొన్ని నెలలుగా, వాట్సాప్ వినియోగదారుల గోప్యతను బలోపేతం చేయడం.. వ్యక్తిగత డేటాను రక్షించడం లక్ష్యంగా అనేక అప్డేట్స్ చేస్తూనే ఉంది. చాట్‌లు, సమూహ సంభాషణల నుంచి ఇతరులు టెక్స్ట్, ఫోటోలు లేదా వీడియోలను కాపీ చేయకుండా నిరోధిచడమే లక్ష్యంగా సంస్థ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ తీసుకొస్తోంది. అంతే కాకుండా.. వాట్సాప్ చాట్ లాక్ వంటి మెరుగైన ఫీచర్స్ కూడా ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులు పాస్‌వర్డ్, వేలిముద్ర లేదా ఫేస్ ఐడితో వ్యక్తిగత చాట్‌లను సురక్షితంగా ఉంచడానికి అనుమతిస్తుంది.

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)