Breaking News

ఇకపై వాట్సప్‌లో ప్రకటనలు?

Published on Tue, 06/17/2025 - 13:16

ప్రముఖ ఆన్‌లైన్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌(Whatsapp) యూజర్ ప్రైవసీ, ఎన్‌క్రిప్షన్‌ ప్రమాణాలను పాటిస్తూ ఆదాయాన్ని ఆర్జించాలనే వ్యూహంతో చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా యాప్‌లో యాడ్స్‌ ద్వారా రెవెన్యూ సంపాదించాలని చూస్తుంది. ఇతర ప్లాట్‌ఫామ్‌ల మాదిరిగా కాకుండా ఇప్పటివరకు ఎలాంటి యాడ్స్‌ లేకుండానే మెటా వాట్సప్‌లో మెసేజింగ్‌ సర్వీసులను ఉచితంగా అందించింది. ఇకపై వాట్సప్‌ స్టేటస్‌లో యాడ్‌ల ద్వారా ఆదాయం సంపాదించాలని భావిస్తుంది. అయితే ఈ యాడ్స్‌ కేవలం అప్‌డేట్స్‌ ట్యాబ్‌లో మాత్రమే కనిపిస్తాయని, పర్సనల్‌ చాట్స్‌ ఎప్పటిలానే యాడ్‌ఫ్రీగా ఉంటాయని వాట్సప్‌ స్పష్టం చేసింది.

వాట్సప్‌ యాప్‌లోని అప్‌డేట్స్‌ ట్యాబ్‌ ఆప్షన్‌లో ప్రకటనలకు చెందిన ఫీచర్లను తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అప్‌డేట్స్‌ ట్యాబ్‌లో ప్రస్తుతం ఛానళ్లు, స్టేటస్ బ్లాక్‌లో అడ్వర్టైజ్‌మెంట్లు కనిపించనున్నాయి. నిత్యం దాదాపు 2 బిలియన్‌ల వినియోగదారులు ఈ అప్‌డేట్‌ బ్లాక్‌ చూస్తున్నారని వాట్సప్‌ తెలిపింది. దాంతో విభిన్న సంస్థలు ప్రమోట్‌ చేయాలనుకునే ఉత్పత్తులు లేదా ఇతర వివరాలను యాడ్‌ ఇచ్చేందుకు దీన్నో అవకాశంగా చూపుతుంది. మూడు రకాల యాడ్‌ ఫీచర్లు తీసుకొస్తున్నట్లు పేర్కొంది.

పెయిడ్ ఛానల్ సబ్ స్క్రిప్షన్‌లు

క్రియేటర్లు, వ్యాపారాలు లేదా ఇన్‌ఫ్లూయెన్సర్ల నుంచి ప్రత్యేక కంటెంట్‌ను యాక్సెస్ చేసేందుకు నెలవారీ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇది టెలిగ్రామ్, యూట్యూబ్‌లో కనిపించే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ మోడల్స్ మాదిరిగానే ఉంటుంది.

ప్రమోటెడ్‌ ఛానల్స్..

వ్యాపారాలు,  కంటెంట్ క్రియేటర్లు తమ ఛానళ్లను ప్రమోట్ చేయడం ద్వారా విజిబిలిటీని పెంచుకోవచ్చు. యాప్‌లోని డిస్కవరీ సెక్షన్‌లో అడ్వర్టైజ్‌మెంట్ ఛానల్స్ కనిపిస్తాయి.

స్టేటస్‌ యాడ్స్‌

ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్ తరహాలో స్టేటస్ ఫీచర్‌లో యాడ్స్ ఉంటాయి. స్టేటస్ అప్‌డేట్‌ల మధ్య టార్గెట్ చేసిన ప్రమోషనల్ కంటెంట్‌ను యూజర్లు వీక్షించవచ్చు.

ఇదీ చదవండి: గరిష్ఠాల నుంచి పడిన పసిడి ధర! తులం ఎంతంటే..

ప్రైవసీ పట్ల నిబద్ధత

తాజాగా ప్రతిపాదించిన మార్పులు ఉన్నప్పటికీ వ్యక్తిగత సందేశాలు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్‌గానే ఉంటాయని వాట్సప్‌ తెలిపింది. అంటే ప్రైవేట్ చాట్‌ల్లో ఎటువంటి ప్రకటనలు కనిపించవని వినియోగదారులకు హామీ ఇచ్చింది. ఫోన్ నంబర్‌, వ్యక్తిగత వివరాలు ఎట్టిపరిస్థితుల్లో ప్రకటనదారులతో పంచుకోమని వాట్సప్‌ స్పష్టం చేసింది. వినియోగదారుల లొకేషన్, భాష.. వంటి సాధారణ డేటా ఆధారంగా ప్రకటనలు ఉంటాయని తెలిపింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)