Breaking News

కేంద్రం చెంతకు పంచాయితీ!

Published on Wed, 10/08/2025 - 08:23

బోర్డు నియామకాలు, గవర్నెన్స్‌ అంశాలపై ట్రస్టీల మధ్య విభేదాలతో టాటా ట్రస్ట్స్‌లో అంతర్గతంగా ఆధిపత్య పోరు నెలకొన్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌ నోయెల్‌ టాటా, టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ మంగళవారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. హోంమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో టాటా ట్రస్ట్స్‌ వైస్‌ చైర్మన్‌ వేణు శ్రీనివాసన్, ట్రస్టీ డేరియస్‌ ఖంబట్టా కూడా ఉన్నారు.

ట్రస్టీల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో టాటా గ్రూప్‌నకు చాలా ప్రాధాన్యమున్న నేపథ్యంలో దాని పూర్తి నియంత్రణను ఏ ఒక్కరి చేతికో ఇవ్వడం శ్రేయస్కరమేనా కాదా అనేది ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న సవాలుగా మారిందని వివరించాయి. టాటా ట్రస్ట్స్‌ ట్రస్టీల మధ్య విభేదాలు టాటా సన్స్‌పైనా ప్రభావం చూపుతాయని పేర్కొన్నాయి.

రెండు వర్గాలుగా ట్రస్టీలు..

156 ఏళ్ల దిగ్గజ గ్రూప్‌ టాటా సన్స్‌ గొడుగు కింద 30 లిస్టెడ్‌ కంపెనీలతో పాటు 400 కంపెనీలు ఉన్నాయి. దీనిపై గణనీయంగా ప్రభావం చూపే.. టాటా ట్రస్ట్స్‌కి టాటా సన్స్‌లో 66 శాతం వాటాలు ఉన్నాయి. ప్రస్తుతం టాటా సన్స్‌ బోర్డులో నియామకాలు, గవర్నెన్స్‌ అంశాల మీద వివాదం నెలకొంది. టాటా సన్స్‌ బోర్డులో నామినీ డైరెక్టరుగా మాజీ డిఫెన్స్‌ కార్యదర్శి విజయ్‌ సింగ్‌ పునర్నియామకం కోసం సెప్టెంబర్‌ 11న జరిగిన ఆరుగురు ట్రస్టీల సమావేశంలో దీనికి బీజం పడింది. విజయ్‌ పేరును ట్రస్ట్స్‌ చైర్మన్‌ నోయెల్‌ టాటా, వేణు శ్రీనివాసన్‌ ప్రతిపాదించగా, నలుగురు ట్రస్టీలు (మెహ్లి మిస్త్రీ, ప్రమిత్‌ ఝవేరీ, జహంగీర్‌ హెచ్‌సీ జహంగీర్, డేరియస్‌ ఖంబట్టా) వ్యతిరేకించారు. తదుపరి మెహ్లీ మిస్త్రీని నామినేట్‌ చేయాలంటూ ఆయన తరఫున ఉన్న నలుగురు ట్రస్టీలు ప్రతిపాదించగా, టాటా గ్రూప్‌ విలువలను ప్రస్తావిస్తూ దాన్ని నోయెల్‌ టాటా, వేణు శ్రీనివాసన్‌ వ్యతిరేకించారు. దీనితో విభేదాలు తారస్థాయికి చేరినట్లు సమాచారం.

ఇదీ చదవండి: ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలి

కీలకమైన నిర్ణయాల్లో తనను పక్కన పెడుతున్నారంటూ మెహ్లీ మిస్త్రీ భావిస్తుండగా, ఆయన సారథ్యంలోని ట్రస్టీలంతా కలిసి.. ట్రస్ట్స్‌లో నోయెల్‌ టాటా ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని గ్రూప్‌లో కొందరు భావిస్తున్నారు. టాటా సన్స్‌లో 18.37 శాతం వాటాలున్న షాపూర్‌జీ పల్లోంజీ కుటుంబానికి మెహ్లీ మిస్త్రీకి బంధుత్వం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆధిపత్యం కోసం పోరు నడుమ ట్రస్టీలు రెండు వర్గాలుగా చీలిపోయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అక్టోబర్‌ 10న టాటా ట్రస్ట్స్‌ బోర్డు మరోసారి సమావేశం కానుండగా, అజెండా వెల్లడి కాలేదు. ఈ వ్యవహారంపై టాటా ట్రస్ట్‌ టాటా సన్స్, వేణు శ్రీనివాసన్‌ వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. టాటా గ్రూప్‌లో అత్యున్నత స్థాయిలో కొన్నాళ్ల క్రితం కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తింది. అప్పటి గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా, టాటా గ్రూప్‌ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ మధ్య విభేదాలు తలెత్తాయి. ఇవి చివరికి మిస్త్రీ ఉద్వాసనకు దారి తీశాయి. ప్రస్తుతం రతన్‌ టాటా, మిస్త్రీ.. ఇద్దరూ మరణించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)