Breaking News

వచ్చేవారం మార్కెట్లు ఎలా ఉంటాయంటే?

Published on Sat, 10/21/2023 - 15:10

వచ్చే వారంలో మార్కెట్‌ ఎలా ర్యాలీ అవ్వబోతుంది.. వారంతంలో అమెరికా ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ చేసిన వ్యాఖ్యలతో రానున్న రోజుల్లో మార్కెట్‌ ఎలా స్పందిస్తుంది.. దసరా పండగ సీజన్‌లో మార్కెట్‌ ఎలా ఉంటుందనే అంశాలపై సాక్షి బిజినెస్‌ కన్సల్టెంట్‌  కారుణ్య రావు  మాట్లాడారు.

అంతర్జాతీయ మార్కెట్‌లు అనిశ్చితిలో ఉ​న్నాయి. అదే తీరు కొనసాగనుంది. దసరా, దీపావళి పండగ సీజన్‌ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉంది. గ్లోబల్‌గా విదేశీ సంస్థాగత పెట్టుబడులను ఉపసంహరించుకునే వీలుంది. గడిచిన వారంలో ‍క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరిగాయి. డాలర్‌ విలువ పెరుగుతుండడంతో రూపాయి మారకం పడిపోయి ధరలు పెరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారాలు, పండగ నేపథ్యంలో పెద్దగా నష్టపోయే అవకాశం ఉండదు. కేంద్రం అందిస్తున్న  ప్రయోజనాల మూలంగా దేశీయ స్టాక్‌మార్కెట్లు బలంగా ఉన్నాయి. దేశంలో యువత ఎక్కువగా ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కావడంతో తాత్కాలికంగా కొంత ఒడుదుడుకులు నెలకున్నా దీర్ఘకాలికంగా ఎంతో ప్రయోజనం చేకూరనుంది. 

యూఎస్‌ ట్రెజరీలు అనిశ్చితిలో ఉన్నాయి. భవిష్యత్తులో మార్కెట్ సంక్షోభానికి సంబంధించి పెట్టుబడిదారులు ఎలా స్పందిస్తారనే అంశాన్ని గమనించాలి. అమెరికా ట్రూప్‌లపై డ్రోన్‌లు దాడిచేసేందుకు ప్రయత్నించాయనే వార్తలు వచ్చాయి. ఇజ్రాయెల్‌, హమాస్‌కు మాత్రమే యుద్ధం కొనసాగితే మార్కెట్లు పెద్దగా స్పందించే స్థితిలో లేవు. కానీ వాటికి మద్ధతు ఇస్తున్న దేశాల స్పందించే విధానం వల్ల యుద్ధ భయాలు చెలరేగితే మార్కెట్లు నష్టాల్లోకి జారుకునే అవకాశం ఉంటుంది. అమెరికా వడ్డీ రేట్లు పెంచడంతో మదుపర్లు తమ సొమ్మును భద్రంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. యూఎస్‌ 10 ఏళ్లు ట్రెజరీ బాండ్‌లు ఏప్రిల్‌ నుంచి పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన వారంలో గరిష్ఠాన్ని తాకాయి. 

అమెరికా ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పకడ్బందీ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు వడ్డీరేట్లు పెంచాల్సిందేనని అన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావాల్సి ఉందని పావెల్ సంకేతాలిచ్చారు. ఇందుకు రానున్న రోజుల్లో వడ్డీరేట్లు పెంచక తప్పదని ప్రకటించారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినా ఇంకా ఆందోళనకర స్థాయిలోనే కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం రెండు శాతానికి పడిపోయేంత వరకు వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉందన్నారు. ఈ అన్ని కారణాల వల్ల వచ్చేవారం మార్కెట్లు కొంత ఒడుదుడుకులకు లోనవచ్చు.

గతవారంలో నిఫ్టీ 19850 వద్దకు చేరి అక్కడి నుంచి ప్రతికూలంగా స్పందించింది. వారం మధ్యలో బెంచ్‌మార్క్ సూచీల్లో అమ్మాకాలు వెల్లువెత్తాయి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సూచీలు రెండూ వారంలో ఒక శాతం కంటే ఎక్కువ కరెక్ట్ అయ్యాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)