Breaking News

'జియో ఫోన్ కాల్ ఏఐ' లాంచ్: ఇదెలా పనిచేస్తుందంటే?

Published on Thu, 08/29/2024 - 16:16

ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్.. ఏజీఎం సమావేశంలో 'జియో ఫోన్ కాల్ ఏఐ' (JioPhonecall AI) ఆవిష్కరించింది. రిలయన్స్ జియో ఛైర్మన్ 'ఆకాష్ అంబానీ'.. కంపెనీ 47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కొత్త కాల్ రికార్డింగ్ అండ్ ట్రాన్స్‌క్రైబ్ ఫీచర్‌ను ప్రకటించారు.

జియో ఫోన్ కాల్ ఏఐ ప్రతి కాల్‌లో ఏను ఉపయోగించడానికి ముమ్మల్ని అనుమతిస్తుంది. ఇది కమ్యూనికేషన్ మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.

జియో ఫోన్ కాల్ ఏఐతో.. వినియోగదారులు జియో క్లౌడ్‌లో ఎటువంటి ఫోన్ కాల్‌నైనా రికార్డ్ చేసుకోవచ్చు. మాట్లాడే పదాలను కూడా ఏఐ ఆటోమాటిక్‌గా టెక్ట్ రూపంలోకి మారుస్తుంది. ఇది వివిధ భాషలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తద్వారా భాషాపరమైన అవరోధాలతో సంబంధం లేకుండా కమ్యూనికేషన్‌ను మెరుగుపరుస్తుంది.

'జియో ఫోన్ కాల్ ఏఐ' ఎలా ఉపయోగించాలి
జియో ఫోన్ కాల్ ఏఐను ఉపయోగించడం చాలా సులభం. దీనికోసం ఓ ప్రత్యేకమైన నెంబర్ కూడా అందుబాటులో ఉంటుంది. మీరు ఒకవ్యక్తికి కాల్ చేసినప్పుడు.. ఏఐ కాల్ నెంబర్ కూడా కాన్ఫరెన్స్ కాల్ సెటప్ మాదిరిగా డయల్ చేయాల్సి ఉంటుంది.

👉జియో ఫోన్ కాల్ ఏఐ నెంబర్ 1-800-1732673కు డయల్ చేయాలి.
👉నెంబర్ కనెక్ట్ అయిన తరువాత రికార్డింగ్ స్టార్ట్ చేయడానికి 1 క్లిక్ చేయాలి. ఇలా చేసిన తరువాత రికార్డింగ్ ప్రారంభమవుతుంది.
👉మీరు ఏ సమయంలో అయిన ట్రాన్స్‌క్రిప్షన్‌ను పాజ్ చేయవలసి వస్తే 2 క్లిక్ చేయాలి. ఆ తరువాత ఏఐ మీకు ట్రాన్స్క్రిప్షన్ పాజ్ చేసినట్లు చెబుతుంది.
👉మళ్ళీ స్టార్ట్ చేయడానికి 1 క్లిక్ చేయాలి, సెషన్ ముగించడానికి 3 క్లిక్ చేయాలి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)