Breaking News

చెప్పులు ధరించి డ్రైవింగ్‌ చేస్తే చలానా!?

Published on Thu, 09/25/2025 - 13:27

భారతదేశంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించడం చాలా ముఖ్యం. బైక్‌లో వెళ్లినా, కారు నడుపుతున్నా.. ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి ట్రాఫిక్ చట్టాలకు కట్టుబడి ఉండాల్సిందే. నిబంధనలు పాటించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే ట్రాఫిక్ రూల్స్‌ను సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు ప్రజలు సాధారణ ట్రాఫిక్ నియమాలను తప్పుగా అర్థం చేసుకుంటారు. చెప్పులు ధరించి డ్రైవింగ్ చేయడంపై ఇటీవల సామాజిక మాధ్యమాల్లో భిన్న అభిప్రాయాలతో పోస్టులు వైరల్‌గా మారుతున్నాయి.

చెప్పులు ధరించి కారు లేదా ద్విచక్ర వాహనం నడపడం భారతదేశంలో చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుందని కొందరు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తున్నారు. అయితే నిబంధనల ప్రకారం ఇది నిజం కాదు. మోటారు వాహన చట్టం ప్రకారం చెప్పులు ధరించి ఎవరైనా వాహనం నడుపుతున్నట్లయితే జరిమానా విధించడం లేదా చలానా వేసే నిబంధన ఏదీ లేదు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గతంలో ట్రాఫిక్ నిబంధనలను తప్పుగా అర్థం చేసుకోవడం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని ట్వీట్ చేశారు.

చెప్పులు  ధరించి డ్రైవింగ్ చేయడం సురక్షితమేనా?

చెప్పులు ధరించి డ్రైవ్ చేయడం అంత సురక్షిత​ం మాత్రం కాదని కొందరు రోడ్డు, రవాణా నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అవి పెడల్స్, గేర్ లీవర్‌పై పట్టుతప్పే అవకాశం ఉందంటున్నారు. అందువల్ల డ్రైవింగ్ చేసేటప్పుడు షూ ధరిస్తే మేలని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: లైక్స్‌, కామెంట్స్‌ కోసం ఆరాటపడితే అంతే..

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)