Breaking News

ఏటీఎంలో చిరిగిన నోట్లు వస్తే.. ఆర్బీఐ రూల్స్‌ తెలుసా?

Published on Wed, 10/16/2024 - 21:21

ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసే సమయంలో కొన్ని సార్లు చిరిగిన నోట్లు వస్తుంటాయి. ఈ చిరిగిన నోట్లను బయట దుకాణదారులకు ఇస్తే తీసుకోరు. దీంతో  ఆందోళన మొదలవుతుంది. ఇప్పుడు ఏం చేయాలనే ప్రశ్న మెదులుతుంది. మీకు కూడా అలాంటి సంఘటన జరిగితే చింతించాల్సి పని లేదు. చిరిగిన నోట్లను సులభంగా మార్చుకోవచ్చు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం.. ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు బయటకు వస్తే వాటిని మార్చేందుకు బ్యాంకు నిరాకరించకూడదు. నోట్లను మార్చుకోవడానికి బ్యాంకులో సుదీర్ఘ ప్రక్రియ ఉండదు. నిమిషాల్లో నోట్లు మార్చుకోవచ్చు. చిరిగిన నోట్లు ఏ ఏటీఎం నుండి వచ్చాయో ఆ ఏటీఎం​కి లింక్ చేసిన బ్యాంక్‌కి తీసుకెళ్లి డబ్బు విత్‌డ్రా చేసిన తేదీ, సమయం, విత్ డ్రా చేసిన ఏటీఎం వివరాలతో ఫారం నింపి అందజేయాలి.

ఏటీఎంలో వచ్చినవే కాకుండా ఇతర చిరిగిపోయిన, పాడైపోయిన నోట్లను కూడా బ్యాంక్ బ్రాంచ్ లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాల్లో సులభంగా మార్చుకోవచ్చు. అయితే దీనికి పరిమితిని నిర్ణయించారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి ఒకసారికి గరిష్టంగా 20 నోట్లను మార్చుకోవచ్చు. అలాగే వాటి విలువ రూ. 5000 మించకూడదు. మార్పిడి చేసుకునే చిరిగిన, పాడైన నోట్లపై ముఖ్యమైన సమాచారం కచ్చితంగా ఉండాలి.

దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అత్యాధునిక నోట్ సెట్టింగ్ మెషీన్‌లతో బ్యాంకులోని నోట్ల నాణ్యతను తనిఖీ చేస్తుందని తెలిపింది. దీంతో చిరిగిన లేదా దెబ్బతిన్న నోట్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ ఖాతాదారుడికి ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు వస్తే, బ్యాంకుకు చెందిన ఏదైనా బ్రాంచ్‌కైనా వెళ్లి వాటిని మార్చుకోవచ్చు.

Videos

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)