Breaking News

గూగుల్‌కు పోటీగా ఓపెన్‌ఏఐ కొత్త బ్రౌజర్‌

Published on Thu, 10/23/2025 - 08:48

ఓపెన్ఏఐ తమ ఏఐ ఆధారిత వెబ్ బ్రౌజర్‌ చాట్‌జీపీటీ అట్లాస్‌(ChatGPT Atlas)ను ఇటీవల విడుదల చేసింది. ఇది గూగుల్ క్రోమ్ (Google Chrome), ఇతర బ్రౌజర్లకు పోటీగా నిలువనుందని కంపెనీ తెలిపింది. చాట్‌జీపీటీ అట్లాస్‌ ప్రస్తుతం మ్యాక్‌ ఓఎస్‌ (యాపిల్ ల్యాప్‌టాప్‌లు) వినియోగదారులకు అందుబాటులో ఉంది. త్వరలో విండోస్ (Windows), ఐఓఎస్ (iOS - ఐఫోన్), ఆండ్రాయిడ్ (Android) ప్లాట్‌ఫామ్‌ల్లో విడుదల చేయాలని ఓపెన్ ఏఐ యోచిస్తోంది.

ఫీచర్లు, ప్రత్యేకతలు

సాధారణ బ్రౌజర్‌లకు (Google Chrome, Firefox వంటివి) భిన్నంగా అట్లాస్‌ను  ఇంటెరాక్షన్‌ ఏఐ ఆధారంగా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఇది వెబ్‌ను నావిగేట్ చేయడానికి, ఇంటరాక్ట్ అవ్వడానికి చాట్‌జీపీటీని ప్రధాన ఇంటర్‌ఫేస్‌గా ఉపయోగిస్తుంది.

ఇంటిగ్రేటెడ్ చాట్ అసిస్టెంట్

ఈ బ్రౌజర్‌లో వెబ్‌పేజీలోని కంటెంట్‌కు అనుగుణంగా ఎప్పుడైనా చాట్‌జీపీటీని యాక్సెస్ చేసే వీలు కల్పిస్తున్నారు. దీని ద్వారా వినియోగదారులు ఆ పేజీలోని సమాచారాన్ని సారాంశం రూపంలో తెలుసుకోవచ్చు. కొత్త బ్రౌజర్‌లో డేటాను సైతం విశ్లేషించవచ్చని సంస్థ పేర్కొంది.

ఏజెంట్ మోడ్

ఇది అత్యంత విభిన్నమైన ప్రీమియం ఫీచర్. దీని ద్వారా అట్లాస్‌ వినియోగదారు తరఫున కొన్ని పనులను పూర్తి చేయగలదు. ఉదాహరణకు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడం, ఫారమ్‌లను నింపడం, ప్రయాణాల కోసం సెర్చ్‌ చేయడం లేదా వాటిని ప్లాన్ చేయడం వంటి సంక్లిష్టమైన పనులను ఏఐ ఏజెంట్ నిర్వహిస్తుంది. అయితే ఈ ఫీచర్ చాట్‌జీపీటీప్లస్‌, ప్రో సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది.

బ్రౌజర్ మెమరీ

అట్లాస్ బ్రౌజింగ్ చరిత్ర, గత సంభాషణల వివరాలను గుర్తుంచుకుంటుంది. దీని వల్ల వినియోగదారునికి పనులు మరింత సులభతరం అవుతాయి. ఉదాహరణకు గతవారం చూసిన ఉద్యోగ ప్రకటనలను గుర్తుంచుకొని వాటిని సమ్మరైజ్‌ చేసి ముందుంచుతుంది. అయితే వినియోగదారు గోప్యతను దృష్టిలో ఉంచుకుని దీన్ని ఆన్/ ఆఫ్ చేసుకునే వెసులుబాటు ఉంది.

ఏఐ-పవర్డ్ సెర్చ్

ఇది గూగుల్ సెర్చ్ లేదా బింగ్‌కి బదులుగా చాట్‌జీపీసీ సెర్చ్‌ ద్వారా పనిచేస్తుంది. ఇది సంభాషణాత్మక, సమగ్రమైన, ఏఐ ఆధారిత ఫలితాలను అందిస్తుంది.

ఇదీ చదవండి: వైట్‌హౌస్‌ను కూల్చేస్తున్న ట్రంప్‌

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు