Breaking News

భారత్‌పే కుంభకోణం.. మరొకరి అరెస్టు

Published on Fri, 09/20/2024 - 13:36

ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే మాజీ ఎండీ, సహ వ్యవస్థాపకులు అష్నీర్ గ్రోవర్ కుటుంబ సభ్యుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. సంస్థ నిధుల దుర్వినియోగంలో అష్నీర్‌ బావమరిది దీపక్‌గుప్తాకు సంబంధం ఉందనే ఆరోపణలతో తనను అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) తెలిపింది.

పోలీసుల కథనం ప్రకారం..‘భారత్‌పే సహవ్యవస్థాపకులు అష్నీర్ గ్రోవర్ బావమరిది దీపక్ గుప్తా సంస్థ నిధుల దుర్వినియోగంలో పలువురికి సహకరించినట్లు ఆరోపణలున్నాయి. సంస్థకు చెందిన అనేక మంది విక్రేతలతో ఆయనకు సంబంధం ఉందని ప్రాథమిక సమాచారం. నిధులు దుర్వినియోగం కేసులో ఇప్పటికే అరెస్టయిన అమిత్ కుమార్ బన్సల్‌కు దీపక్‌గుప్తా సూచనలిచ్చారని ఆరోపణలొచ్చాయి’ అని తెలిపారు.

ఇదీ చదవండి: యాపిల్‌ బ్యాటరీ బుల్లెట్‌ప్రూఫ్‌!

అసలేం జరిగిందంటే..

భారత్‌పేలో విధులు నిర్వహించే సమయంలో అష్నీర్‌ గ్రోవర్‌ దంపతులు విలాసాలకు అలవాటుపడి రూ.81 కోట్లు సంస్థ నిధుల్ని కాజేశారు. ట్యాక్స్‌ క్రెడిట్, జీఎస్టీ అధికారులకు పెనాల్టీ చెల్లింపుల్లో అవకతవకలు, ట్రావెల్ ఏజెన్సీలకు అక్రమ చెల్లింపులు, నకిలీ ఇన్‌వాయిస్‌లను సృష్టించడం, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి కార్యకలాపాలకు  పాల్పడ్డారు. ఆ కుంభకోణం వెలుగులోకి రావడంతో భారత్‌పే వారిద్దరిని సంస్థ నుంచి తొలగించింది. ఇదే అంశంపై అష్నీర్‌ దంపతుల్ని విచారించాలని కోరుతూ భారత్‌పే ఢిల్లీ హైకోర్ట్‌ను ఆశ్రయించింది. ఆ కేసులో వాళ్లిద్దరూ విదేశాలకు పారిపోకుండా గతేడాది నవంబర్‌లో ఈఓడబ్ల్యూ లుకౌట్‌ నోటీసులు జారీ చేసింది. వీరిపై ఐపీసీ సెక్షన్లు 406, 408, 409, 420, 467, 120బీ, 201 కింద కేసులు నమోదు చేశారు. అష్నీర్ గ్రోవర్, మాధురీ గ్రోవర్, శ్వేతాంక్ జైన్ (మాధురి సోదరుడు), సురేష్ జైన్ (అష్నీర్ మామ), దీపక్ గుప్తా (అష్నీర్ బావమరిది)పై భారత్‌పే గతంలోనే ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Videos

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

జూడో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం

Photos

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)