Breaking News

‘1600’ కాలింగ్ సిరీస్‌ను తప్పనిసరి చేసిన ట్రాయ్

Published on Thu, 11/20/2025 - 19:50

ఫోన్ కాల్స్ ద్వారా జరిగే ఆర్థిక మోసాలను అరికట్టే దిశగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు(NBFCs), మ్యూచువల్ ఫండ్‌లతో సహా వివిధ వర్గాల ఆర్థిక సంస్థలు తమ సేవలు, లావాదేవీల కోసం ప్రత్యేకంగా ‘1600’ కాలింగ్ సిరీస్‌ను ఉపయోగించడానికి గడువు ప్రకటించింది. నియంత్రిత ఆర్థిక సంస్థల నుంచి వచ్చే నిజమైన కాల్స్‌ను ప్రజలు సులభంగా గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుందని ట్రాయ్‌ తెలిపింది. తద్వారా మోసాల కేసులను గణనీయంగా తగ్గించడానికి తోడ్పడుతుందని అధికారిక ప్రకటనలో పేర్కొంది.

సంస్థల వారీగా గడువులు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్‌ అథారిటీ (PFRDA) నియంత్రణలో ఉన్న సంస్థలు ‘1600’ నంబరింగ్ సిరీస్‌ను తప్పనిసరిగా పాటించాలని, అందుకు గడువు తేదీలను ట్రాయ్ స్పష్టం చేసింది.

సంస్థలుగడువు తేదీ
వాణిజ్య బ్యాంకులు (ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ బ్యాంకులు)జనవరి 1, 2026
పెద్ద ఎన్‌బీఎఫ్‌సీలు, పేమెంట్స్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులుఫిబ్రవరి 1, 2026
మ్యూచువల్ ఫండ్స్ ఏఎంసీలుఫిబ్రవరి 15, 2026
సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీలు, పెన్షన్ ఫండ్ మేనేజర్లుఫిబ్రవరి 15, 2026
మిగిలిన ఎన్‌బీఎఫ్‌సీలు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులుమార్చి 1, 2026
క్వాలిఫైడ్ స్టాక్ బ్రోకర్లు (QSBలు)మార్చి 15, 2026

 

గమనిక: బీమా రంగానికి సంబంధించి IRDAIతో గడువుపై ఇంకా చర్చలు సాగుతున్నాయని, త్వరలోనే ఈ తేదీని ప్రకటిస్తామని ట్రాయ్ తెలిపింది.

టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (BFSI) రంగంలోని సంస్థలతో పాటు ప్రభుత్వ సంస్థల కోసం ప్రత్యేకంగా 1600 సిరీస్‌ను కేటాయించింది. ఇది సాధారణ వాణిజ్య కమ్యూనికేషన్‌ల నుంచి అధికారిక సర్వీసులను వేరు చేయడానికి సహాయపడుతుంది. జాయింట్ కమిటీ ఆఫ్ రెగ్యులేటర్స్ ద్వారా సంప్రదింపులు జరిపిన తర్వాత దశలవారీగా అమలు షెడ్యూల్‌ను జారీ చేసినట్లు ట్రాయ్‌ తెలిపింది. ఇప్పటికే 485 సంస్థలు 1600 సిరీస్‌ను స్వీకరించాయని పేర్కొంది. ఇతర సెబీ రిజిస్టర్డ్ మధ్యవర్తులు వారి రిజిస్ట్రేషన్ వివరాలను ధ్రువీకరించిన తర్వాత స్వచ్ఛందంగా 1600 సిరీస్‌కు మారవచ్చని ట్రాయ్ తెలిపింది.

ఇదీ చదవండి: ఈ-కామర్స్ అనైతిక పద్ధతులకు కేంద్రం కళ్లెం

#

Tags : 1

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)