Breaking News

నష్టాల్లో హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌

Published on Thu, 07/23/2026 - 05:27

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా ముడిచమురు రేట్లు భారీగా పెరిగినప్పటికీ దేశీయంగా ఆ స్థాయిలో పెరగకపోవడంతో ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్‌ దిగ్గజాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నష్టాలు చవిచూశాయి. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) 15 త్రైమాసికాల్లోనే తొలిసారిగా నష్టాలు నమోదు చేసింది. క్యూ1లో రూ. 3,962 కోట్ల నష్టం ప్రకటించింది. 

గతేడాది ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో కంపెనీ రూ. 6,124 కోట్లు, ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో రూ. 3,191 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. తొలి త్రైమాసికంలో ఆదాయం రూ. 1.35 లక్షల కోట్ల నుంచి రూ. 1.59 లక్షల కోట్లకు పెరిగింది. మరోవైపు హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) రూ. 12,265 కోట్ల నష్టం (కన్సాలిడేటెడ్‌) ప్రకటించింది. 

గత క్యూ1లో కంపెనీ రూ. 4,111 కోట్ల లాభం నమోదు చేసింది. తాజాగా ఆదాయం 21 శాతం పెరిగి రూ. 1.45 లక్షల కోట్లకు ఎగిసింది. క్యూ1లో ఎల్‌పీజీపై బీపీసీఎల్‌ రూ. 3,485 కోట్లు, హెచ్‌పీసీఎల్‌ రూ. 3,607 కోట్ల మేర ఆదాయం నష్టపోయాయి. 2026 మార్చి 31 నాటికి హెచ్‌పీసీఎల్‌కి రూ. 12,799 కోట్లు, బీపీసీఎల్‌కి రూ. 12,318 కోట్ల మేర ఎల్‌పీజీ సబ్సిడీ బకాయిలు రావాల్సి ఉన్నాయి.  

బుధవారం బీఎస్‌ఈలో బీపీసీఎల్‌ షేరు సుమారు ఒకటిన్నర శాతం నష్టంతో రూ. 314.50 వద్ద, హెచ్‌పీసీఎల్‌ షేరు దాదాపు మూడు శాతం క్షీణించి రూ. 395.25 వద్ద ముగిశాయి.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)