Breaking News

టాప్‌ ఆశావహ స్టార్టప్‌ 100 లిస్ట్‌: దేశీ సంస్థలు నాలుగు

Published on Thu, 06/22/2023 - 16:03

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ఆశావహ, మార్గదర్శక 100 అంకుర సంస్థల జాబితాలో భారత్‌ నుంచి నాలుగు స్టార్టప్‌లు చోటు దక్కించుకున్నాయి. గిఫ్టోలెక్సియా సొల్యూషన్స్, జాక్‌మాజ్‌ టెక్నాలజీ, ఎవల్యూషన్‌క్యూ, నెక్ట్స్‌ బిగ్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్స్‌ ఇందులో ఉన్నాయి. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) దీన్ని రూపొందించింది. పాఠశాల విద్యార్థుల్లో బోధనాంశాలను నేర్చుకోవడంలో లోపాలు తలెత్తే రిసు్కలను గుర్తించే టెక్నాలజీ ఆధారిత సాధనాన్ని గిఫ్టోలెక్సియా అభివృద్ధి చేస్తోంది. ఈఎస్‌జీ (పర్యావరణం, సామాజిక, గవర్నెన్స్‌) ఇన్వెస్టింగ్‌కు ఉపయోగపడేలా శాటిలైట్‌ డేటాను విశ్లేషిం చే సాంకేతికతను జాక్‌మాజ్‌ రూపొందిస్తోంది.

ఇదీ చదవండి: వేదాంతా భారీ పెట్టుబడులు: ఏకంగా రూ. 14,000 కోట్లు

నెక్ట్స్‌ బిగ్‌ ఇన్నోవేషన్‌ సంస్థ.. 3డీ బయోప్రింటర్లను, ఎవల్యూషన్‌క్యూ సంస్థ ..క్వాంటమ్‌ టెక్నాలజీలకు సైబర్‌సెక్యూరిటీ ఉత్పత్తులను అందిస్తోంది. వ్యాపారం, సమాజంపై గణనీయంగా ప్రభావం చూపగలిగే కొత్త సాంకేతికతలను ఆవిష్కరించే అంకుర సంస్థలతో డబ్ల్యూఈఎఫ్‌ 2000 నుంచి టెక్నాలజీ పయోనీర్స్‌ జాబితాను రూపొందిస్తోంది. ఈ ఏడాది లిస్టులో 31 దేశాలకు చెందిన స్టార్టప్‌లు చోటు దక్కించున్నాయి. అమెరికా నుంచి అత్యధికంగా 29 కంపెనీలు, తర్వాత చైనా నుంచి 12 సంస్థలు ఉన్నాయి. టెక్నాలజీ పయోనీర్స్‌గా ఎంపికైన అంకుర సంస్థలకు.. ఎయిర్‌బీఎన్‌బీ, గూగుల్, ట్విటర్‌ వంటి దిగ్గజాల సరసన చోటు దక్కుతుంది.  

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)