Breaking News

బయో ఎకానమీలో భారత్‌ దూకుడు

Published on Wed, 11/11/2026 - 07:54

ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు బయో ఎకానమీ అభివృద్ధికి భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని, ఈరంగంలో డిమాండ్, సరఫరా రెండూ సమాంతరంగా వృద్ధి చెందుతున్న దేశాలకు భారత్‌ స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తోందని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) వెల్లడించింది. పరిశోధన, అభిృద్ధి నుంచి పన్ను ప్రోత్సాహకాలు, సంస్థాగత సామర్థ్యాల పెంపు వరకు భారత్‌ అనుసరిస్తున్న విధానాలు బయో ఎకానమీ విస్తరణకు దోహదపడుతున్నాయని పేర్కొంది. క్యాప్‌ జెమినీ ఇన్వెంట్‌ సహకారంతో రూపొందించిన బయో ఎకానమీ పాలసీ ఇండెక్స్‌ నివేదికలో ఈ అంశాలను వివరించింది. జపాన్, బ్రిటన్, జర్మనీ, అమెరికా,భారత్, చైనా, బ్రెజిల్‌ దేశాల్లో అమలవుతున్న 935 బయో ఎకానమీ విధానపరమైన కార్యక్రమాలను ఈ నివేదిక విశ్లేషించింది.

భారత్‌లో బయో ఎకానమీ వేగంగా విస్తరిస్తోందని ఇందుకు బయోటెక్నాలజీ ఫర్‌ ఎకానమీ, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ (బయోఈ3) పాలసీ వంటి లక్ష్యిత జాతీయ కార్యక్రమాలు మద్దతుగా నిలుస్తున్నాయని డబ్ల్యూఈఎఫ్‌ తెలిపింది. భారత్‌ లోని మొత్తం విధాన పరమైన కార్యక్రమాల్లో 48 శాతం పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) , పన్ను ప్రోత్సాహకాలు, సంస్థాగత సామర్థ్యాల పెంపు వంటి ఉమ్మడి అవసరాలపై దృష్టి సారిస్తున్నాయని వెల్లడించింది. ఒక నిర్దిష్ట రంగానికి మాత్రమే పరిమితం కాకుండా అనేక రంగాలకు ప్రయోజనం చేకూర్చే విధానాల అమలులో భారత్‌ ముందుందని పేర్కొంది. విధాన పరమైన సాధనాల వినియోగంలో భారత్‌ 76 శాతంతో అగ్రస్థానంలో ఉంది.  

ఇథనాల్‌ మిశ్రమంలో ముందడుగు

డిమాండ్, సరఫరా రెండూ ఏకకాలంలో పెరిగేందుకు భారత్‌ అనుసరించిన విధానాలను డబ్ల్యూఈఎఫ్‌ ప్రత్యేకంగా ప్రస్తావించింది. పెట్రోల్‌లో ఇథనాల్‌ కలిపే కార్యక్రమానికి అనుగుణంగా కొత్త డిస్టిలరీల సామర్ధ్యం పెంచేందుకు ప్రభుత్వం ఇథనాల్‌ వడ్డీ రాయితీ పథకం ద్వారా రుణాలు అందిస్తోందని తెలిపింది. తప్పనిసరి ఇంధన డిమాండ్‌కు అనుగుణంగా భారత్‌లో ఇథనాల్‌ ఉత్పత్తి కూడా పెరిగిందని, వాస్తవానికి 2030 నాటికి సాధించాలని నిర్దేశించుకున్న 20 శాతం ఇథనాల్‌ మిశ్రమ లక్ష్యాన్ని ఐదేళ్ల ముందుగానే భారత్‌ చేరుకోగలిగిందని నివేదిక పేర్కొంది.

ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 9.52 కోట్ల టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ ఉద్గారాలు తగ్గినట్లు గణాంకాల ద్వారా తెలుస్తోందని వివరించింది. బయో ఎకానమీ అభివృద్ధికి ప్రభుత్వాలు రూపొందించే విధానాలు కేవలం పెట్టుబడులకే పరిమితం కాకూడదని డబ్ల్యూఈఎఫ్‌ సూచించింది. ఉత్పత్తులకు మార్కెట్‌ సృష్టించడం, వాణిజ్య పరంగా ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించడం, ప్రారంభ దశ నుంచే ఫలితాలను అంచనావేసే విధానాలను రూపొందించాలని పేర్కొంది.

ఇదీ చదవండి: ‘దుస్తులు ధరించని సమయాల్లో రికార్డు చేస్తున్నారు!’

#

Tags : 1

Videos

ఇదేనా నీ సనాతన ధర్మం..! పవన్ పై జడ శ్రవణ్ సంచలన కామెంట్స్

ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన MPTC శ్రావణి

AP హైకోర్టులో YS జగన్ పిటిషన్ పై విచారణ

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

Photos

+5

సిద్దు జొన్నలగడ్డ కొత్త చిత్రం ప్రారంభం (ఫోటోలు)

+5

'గోట్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. దివ్య భారతి హైలైట్! (ఫొటోలు)

+5

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫోటోలు)

+5

కుటుంబంతో కలిసి హీరో రిషబ్ శెట్టి దీపావళి వేడుకలు (ఫోటోలు)

+5

వరంగల్ : నేతకాని ‘దీపావళి బతుకమ్మ’ (ఫోటోలు)

+5

‘మాయలేడి’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

సుడిగాలి సుధీర్ ‘G.O.A.T’ సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : డీజే సంగీత హోరు.. దున్నరాజుల విన్యాసాలు (ఫోటోలు)

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)