Breaking News

స్నానానికి సిగ్నల్‌ సిస్టమ్‌.. కొలతల కొళాయి: సరికొత్త గ్యాడ్జెట్స్

Published on Sun, 04/27/2025 - 14:36

అసలే వేసవి కాలం, నీటి కష్టాలు చాలానే ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే.. పట్టణ ప్రాంతాల్లో వాటర్ ప్రాబ్లమ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి నీటిని పొదుపుగా వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం కొన్ని ప్రత్యేకమైన పరికరాలు అందుబాటులోకి వచ్చేశాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో..

వాటర్‌ పెబుల్‌
కచ్చితమైన కొలతతో స్నానం చేస్తే చాలా నీటిని ఆదా చేసిన వారమవుతాం. అయితే, అంత కచ్చితంగా కొలత ప్రకారం స్నానం చేయడం సులువుగా సాధ్యం కాదు. అందుకే, రూపొందించారు ఈ ‘వాటర్‌ పెబుల్‌’. చూడ్డానికి చిన్న గుండ్రటి బిళ్లలా కనిపిస్తుంది. కాని, ఈ పెబుల్‌ మిమ్మల్ని కేవలం నాలుగు నిమిషాల్లో మాత్రమే స్నానం చేసేలా ట్రైన్‌ చేయగలదు.

సమయం మించిపోయే కొద్దే ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ మాదిరి ఎరుపు, నారింజ, ఆకుపచ్చ లైట్లతో హెచ్చరికలు చేస్తుంది. ఎరుపు రంగు లైట్‌ చూపిస్తే, స్నానం వెంటనే పూర్తి చేయమని అర్థం. నారింజ అయితే సగం స్నానం పూర్తి చేశారని అర్థం. ఆకుపచ్చ అయితే, సమయం ఇంకా ఉందని అర్థం. ఇలా ఎంతో సులభంగా అందరూ అర్థం చేసుకునేలా ఉండే దీని ధర 14 డాలర్లు (రూ. 1,119) మాత్రమే!

కొలతల కొళాయి 
మంచినీటి కొళాయి మనకు ఎంత అవసరమో అంతే నీటిని, కొలిచి ఇస్తే బాగుంటుంది కదూ! అచ్చం ఇలాగే ఈ ‘మెజర్‌ఫిల్‌ టచ్‌ కిచెన్‌ టాప్‌’ పనిచేస్తుంది. చాలా రకాల వంటకాలు కచ్చితమైన నీటి కొలతతోనే వండాలి. వంటగదికి ఇది బాగా ఉపయోగపడుతుంది. వంద మిల్లీ లీటర్ల నుంచి ఐదు లీటర్ల వరకు కచ్చితమైన నీటి పరిమాణాన్ని ఇది అందించగలదు. అవసరమైన మేర కొలతను సర్దుబాటు చేసుకునే వీలుంది. ఇక ఇందులోని టచ్‌ ఫంక్షనాలిటీ  సాయంతో సులభంగా ఆన్, ఆఫ్‌ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ట్యాప్‌ ఆఫ్‌ చేయటం మర్చిపోతే, ఐదు నిమిషాల తర్వాత ఆటోమేటిక్‌గా ట్యాప్‌ ఆఫ్‌ అయిపోతుంది. ధర రూ. 359 డాలర్లు (రూ. 30,741).

ఇదీ చదవండి: కొత్త ఏటీఎమ్‌.. ఇలా బంగారం వేస్తే అలా డబ్బులొస్తాయ్‌..

తడిపొడి విడివిడి..
వేసవి వచ్చిదంటే చాలామంది వాటర్‌ రైడ్స్, స్విమ్మింగ్‌ ఇలా వివిధ రకాల జలక్రీడలతో కాలక్షేపం చేయడానికి Ðð ళ్తుంటారు. అయితే, చెమట, తడి దుస్తుల కారణంగా లగేజీ మొత్తం దుర్వాసన వస్తుంది. ఇలా కాకుండా ఈ వెట్‌ అండ్‌ డ్రై సపరేషన్‌ బ్యాగ్‌తో తడి దుస్తులను, పొడి దుస్తులను వేర్వేరుగా ఉంచితే, దుర్వాసన రాకుండా ఇది అరికడుతుంది. ఇది అత్యుత్తమ వాటర్‌ ప్రూఫ్‌ లైనింగ్, వాటర్‌ ప్రూఫ్‌ జిప్పర్‌తో వస్తుంది. జిమ్, లాండ్రీ బ్యాగ్‌లా కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. స్మాల్, మీడియం, లార్జ్‌ ఇలా వివిధ సైజుల్లో లభిస్తుంది. ధర వివిధ తయారీ కంపెనీలు, పరిమాణాలను బట్టి ఉంటుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)