Breaking News

మధ్యతరగతి వారికి వారెన్ బఫెట్ ఆర్థిక సలహా

Published on Sat, 10/11/2025 - 13:32

ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారుల్లో ఒకరైన వారెన్ బఫెట్ తన ఆచరణాత్మక, సరళమైన ఆర్థిక సలహాలకు ప్రసిద్ధి చెందారు. సామాన్యులు బిలియనీర్‌గా ఎదగాలంటే ఏం చేయాలో బఫెట్‌ చెప్పిన ఆర్థిక సూత్రాల్లో కొన్ని ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్న బఫెట్‌ సూత్రాల ప్రకారం..‘మధ్యతరగతివారు తరచుగా ఎలా బిలియనీర్‌గా మారాలని భావిస్తుంటారు. సాధారణంగా అన్నింటికంటే ముందు పొదుపు, పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వాలనే సూత్రాలు ఉన్నాయి. వీటితో దీర్ఘకాలంలో డబ్బు పోగు చేయవచ్చు. అయితే మధ్యతరగతి ప్రజలు మరింత పొదుపు చేసేందుకు మాత్రం ముందుగా తాము చేస్తున్న పనిలో నైపుణ్యాలు పెంచుకునేందుకు ఇన్వెస్ట్‌ చేయాలి. దీనివల్ల భవిష్యత్తులో మెరుగైన అవకాశాలు సాధించవచ్చు. ఆర్థికంగా పుంజుకునేందుకు వీలవుతుంది. ఇలా వచ్చిన డబ్బును పెట్టుబడులకు మరింతగా మళ్లించి దీర్ఘకాలంలో బిలియనీర్‌గా మారవచ్చు’ అన్నారు.

‘సాధారణంగా మధ్యతరగతివారు నెలవారీ వచ్చిన ఆదాయాన్ని వివిధ అవసరాలకు ఖర్చు చేసిన తర్వాత మిగిలినదాన్ని ఆదా చేయాలనే ధోరణితో ఉంటారు. కానీ పొదుపు చేసిన తర్వాతే మిగిలినదాన్ని ఖర్చు చేయాలని గుర్తించుకోవాలి. జీతం రాగానే మొదట కొంత మొత్తాన్ని పొదుపు లేదా పెట్టుబడుల కోసం కేటాయించి, మిగిలిన డబ్బుతో మాత్రమే ఖర్చులను నిర్వహించాలి. వృధా ఖర్చులను తగ్గించుకోవాలి’ అని బఫెట్‌ చెప్పారు.

ఇదీ చదవండి: చైనాపై అదనంగా 100 శాతం సుంకాలు..

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)