Breaking News

హైదరాబాద్‌లో వేర్‌హౌస్‌ స్థలాలకు డిమాండ్‌

Published on Sat, 07/29/2023 - 07:22

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో గిడ్డంగుల స్థలాలకు డిమాండ్‌ పెరుగుతుంది. 2023 ఆర్ధిక సంవత్సరంలో నగరంలో 51 లక్షల చ.అ. వేర్‌హౌస్‌ స్పేస్‌ లావాదేవీలు జరిగాయి. అయితే 2022 ఆర్ధిక సంవత్సరంలోని 54 లక్షల చ.అ. లావాదేవీలతో పోలిస్తే ఇది 7 శాతం తక్కువని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా నివేదిక వెల్లడించింది. థర్డ్‌ పార్టీ లాజిస్టిక్స్‌ (3 పీఎల్‌), ఈ–కామర్స్‌ సంస్థల లావాదేవీలలో తాత్కాలిక మందగమనమే ఈ క్షీణతకు ప్రధాన కారణమని పేర్కొంది. ఆన్‌లైన్‌ షాపింగ్‌కు పెరుగుతున్న ఆదరణ, లాస్ట్‌మైల్‌ డెలివరీ ఆవశ్యకత నేపథ్యంలో గిడ్డంగుల విభాగానికి దీర్ఘకాలిక డిమాండ్‌ ఉంటుందని తెలిపింది. 

  • వేర్‌హౌస్‌ లావాదేవీలలో తయారీ రంగం హవా కొనసాగుతుంది. 2023 ఫైనాన్షియల్‌ ఇయర్‌లో జరిగిన గిడ్డంగుల లీజుల మాన్యుఫాక్చరింగ్‌ విభాగం వాటా 39 శాతం కాగా.. 3 పీఎల్‌ 21 శాతం, ఈ–కామర్స్‌ 17 శాతం, రిటైల్‌ రంగం 14 శాతం, ఎఫ్‌ఎంసీజీ 5 శాతం, ఎఫ్‌ఎంసీడీ 1 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. 
  • మేడ్చల్‌ క్లస్టర్‌లో వేర్‌హౌస్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. 2022 ఆర్ధిక సంవత్సరంలోని గిడ్డంగుల లావాదేవీలలో ఈ క్లస్టర్‌ వాటా 60 శాతం ఉండగా.. 2023 నాటికి 61 శాతానికి పెరిగింది. శంషాబాద్‌ క్లస్టర్‌లో క్షీణత, పటాన్‌చెరు క్లస్టర్లలో స్వల్ప వృద్ధి కనిపించింది. ఏడాది సమయంలో శంషాబాద్‌ వాటా 30 శాతం నుంచి 27 శాతానికి తగ్గగా.. పటాన్‌చెరు క్లస్టర్‌ వాటా 10 శాతం నుంచి 11 శాతానికి పెరిగింది. 
  • హైదరాబాద్‌ అనేక రంగాలు ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ (పీఎల్‌ఐ) స్కీమ్‌ కింద అనుమతులు పొందాయి. ప్రధానంగా సెల్‌ఫోన్ల తయారీ, ఆటో అనుబంధ రంగానికి చెందిన సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవటంతో గిడ్డంగుల స్థలాలకు డిమాండ్‌ ఏర్పడిందని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా సీఎండీ శిశిర్‌ బైజల్‌ అన్నారు. 

నగరంలోని ప్రధాన గిడ్డంగుల క్లస్టర్లు ఇవే
మేడ్చల్‌ క్లస్టర్‌లో మేడ్చల్, దేవరయాంజాల్‌–గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, యెల్లంపేట్, షామీర్‌పేట్, పటాన్‌చెరు ఇండస్ట్రియల్‌ ఏరియా, రుద్రారం, పాశమైలారం, ఎదులనాగులపల్లి, సుల్తాన్‌పూర్, ఏరోట్రోపోలిస్, శ్రీశైలం హైవే, బొంగ్లూరు, కొత్తూరు, షాద్‌నగర్‌. ఆయా ప్రాంతాలలో గ్రేడ్‌–ఏ గిడ్డంగుల అద్దె చ.అ.కు రూ.19–21గా, గ్రేడ్‌–బీ అయితే రూ.16–19గా ఉంది.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)