Breaking News

యుద్ధ భయం.. బీమా ప్రీమియం ప్రియం

Published on Fri, 03/06/2026 - 10:36

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో అత్యంత రిస్కీ ప్రాంతాల నుంచి వెళ్లే నౌకలకు యుద్ధ రిస్కుల కవరేజీకి సంబంధించి మరింత ఎక్కువగా ప్రీమియం చెల్లించాల్సి రానుందని నిపుణులు తెలిపారు. క్రూడాయిల్, ద్రవీకృత సహజ వాయువును రవాణా చేసే షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌సీఐ) నౌకలు, ముఖ్యంగా ఎర్ర సముద్రం ప్రాంతం గుండా వెళ్లేవి, ఇంకా అధికంగా చెల్లించాల్సి రావచ్చని పాలసీబజార్‌ హెడ్‌ (మెరైన్‌ ఇన్సూరెన్స్‌) ఆర్‌. బాలసుందరం తెలిపారు.

ఇలాంటి పరిణామాలతో సమీప భవిష్యత్తులో ఆయిల్‌ ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు. పర్షియన్‌ గల్ఫ్‌లో ఉద్రిక్తతలతో మెరైన్‌ ఇన్సూరెన్స్‌కి సంబంధించి వార్‌ రిస్క్‌ కవరేజీని బీమా సంస్థలు ఉపసంహరించాయని ఇన్సూరెన్స్‌ బ్రోకర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐబీఏఐ) నిపుణుడు హరి రాధాకృష్ణన్‌ తెలిపారు. సాధారణంగా మెరైన్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల కింద యుద్ధం, సమ్మెలు, అల్లర్లు మొదలైనవాటికి సంబంధించిన కవరేజీ రద్దుకు మూడు రోజుల నుంచి ఏడు రోజుల వరకు నోటీసు పీరియడ్‌ ఉంటుందని పేర్కొన్నారు.

ఒకసారి రద్దయితే, తాజాగా రిస్క్‌ కవరేజీ దొరక్కపోవచ్చని, ఒకవేళ లభించినా భరించలేనంత స్థాయిలో ప్రీమియంలు ఉంటాయని రాధాకృష్ణన్‌ చెప్పారు. మెరైన్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల ప్రీమియంలు 0.25 శాతం–0.50 శాతం నుంచి ఒక్క శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోందని తెలిపారు. దీనితో షిప్పింగ్‌ వ్యయాలు గణనీయంగా పెరుగుతాయని, అంతర్జాతీయంగా వాణిజ్య వ్యవహారాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు. విమానయాన సంస్థలు కార్యకలాపాలు నిర్వహించాలంటే ఇజ్రాయెల్‌ తరహాలో ప్రభుత్వాల నుంచి రీఇన్సూరెన్స్‌పరమైన దన్ను అవసరమవుతుందని రాధాకృష్ణన్‌ తెలిపారు.

యుద్ధంతో సవాళ్లు తీవ్ర స్థాయిలో పెరిగితే రిస్కు స్థాయిని బట్టి ఇన్సూరెన్స్‌ కంపెనీలు సత్వరం ప్రీమియంలను మార్చే అవకాశం ఉందని ప్రూడెంట్‌ ఇన్సూరెన్స్‌ బ్రోకర్స్‌ హెడ్‌ (మెరైన్‌ స్పెషాలిటీస్‌) గౌరవ్‌ అగర్వాల్‌ చెప్పారు. కార్గో విలువపై ప్రీమియంను లెక్కిస్తారని, ప్రస్తుత పరిస్థితుల్లో కార్గో రేటు మారకపోయినా, ప్రీమియం మాత్రం పెరగొచ్చని వివరించారు. అయితే, ఉద్రిక్తతలు భారీగా విస్తరిస్తే తప్ప బీమా ప్రీమియంలు విస్తృత స్థాయిలో పెరగకపోవచ్చని పేర్కొన్నారు.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు