Breaking News

‘రాజకీయంగా దాడి చేశారు.. వారు దెబ్బతినడం బాధించింది’

Published on Thu, 03/14/2024 - 12:54

అదానీ గ్రూప్‌ స్టాక్స్‌పై షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికతో గతేడాది ఇన్వెస్టర్లలో ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. దాంతో పెద్దమొత్తంలో స్టాక్‌ ధరలు తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి. ఆ నివేదిక వెలువడినప్పటి నుంచి ఇన్వెస్టర్ల సంపద భారీగా పతనమైంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అదానీ గ్రూప్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని అదానీ ఇటీవల తెలిపారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో అదానీ మాట్లాడుతూ హిండెన్‌బర్గ్‌ వ్యవహారాన్ని ఎలా  కట్టడిచేశామో తెలిపారు. 

‘హిండెన్‌బర్గ్‌ ఆరోపణలను వచ్చాక తొలుత వాటికి ప్రాధాన్యం ఇవ్వలేదు. పూర్తిగా పాత సమాచారాన్నే ఆ సంస్థ కొత్త రూపంలో పేర్కొంది. ఆ వివాదం వెంటనే తొలగిపోతుందనుకున్నాను. ప్రపంచంలో ఓ కార్పొరేట్‌ కంపెనీపై జరిగిన అతిపెద్ద దాడి అది. సాధారణంగా షార్ట్‌సెల్లర్లు చేసే దాడులకు వ్యాపార కోణమే ఉంటుంది. కానీ, మాపై జరిగినది కేవలం ఫైనాన్షియల్‌ మార్కెట్లకే పరిమితం కాలేదు.. రాజకీయ కోణం కూడా సంతరించుకుంది. చాలా సమన్వయంతో మమ్మల్ని దెబ్బకొట్టాలనుకున్నారు. చాలా తొందరగానే హిండెన్‌బర్గ్‌ కుట్రను అర్థం చేసుకున్నాను. గతంలో ఈ స్థాయి సంక్షోభాన్ని ఎదుర్కొన్న అనుభవం లేదు. దాంతో మా సొంత ప్లాన్‌ సిద్ధం చేసుకున్నాం. 

ఇందులో భాగంగా రూ.20 వేల కోట్లు విలువైన ఎఫ్‌పీవోను వెనక్కి తీసుకొన్నాం. రూ.75,000 కోట్ల నగదు, రూ.17,500 కోట్ల ప్రీపెయిడ్‌ మార్జిన్‌ లింక్డ్‌ ఫైనాన్సింగ్‌తో నిధి ఏర్పాటు చేశాం. సీఈవోలు, ఎగ్జిక్యూటివ్‌లను వ్యాపారంపై శ్రద్ధ పెట్టాలని సూచించాం. ఖావ్డ, ధారావి వంటి కొత్త ప్రాజెక్టుల రూపంలో వ్యాపార విస్తరణను కొనసాగించాం. వార్‌రూమ్‌ ఏర్పాటు చేశాం. దాంతో ఇన్వెస్టర్లకు ఎదురైన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాం. 

ఇదీ చదవండి: మానవ మెదడుతో ఏదీ సరితూగదు.. ఏఐని తలదన్నే ఉద్యోగాలివే..

ఈ వ్యవహారం నుంచి ఓ విషయం నేర్చుకొన్నాం. మంచి పనిచేయడమే కాదు.. మన గురించి అందరికీ తెలియాలి. కమ్యూనికేషన్‌ మరింత పెంచుకోవాలి. హిండెన్‌బర్గ్‌ వ్యవహారం మొత్తంలో చిన్న వాటాదారులు దెబ్బతినడమే నన్ను బాధించింది. మా కంపెనీలు తిరిగి పుంజుకొన్నాక హిండెన్‌బర్గ్‌ నివేదికలో నిజం లేదని తేలింది’ అని గౌతమ్‌ అదానీ వివరించారు.

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)