Breaking News

మూడేళ్లలో లక్ష ఎంఎస్‌ఎంఈలు

Published on Fri, 06/20/2025 - 10:12

అమెరికన్‌ రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ భారత్‌లో మరిన్ని చిన్న, మధ్య తరహా సంస్థలతో (ఎంఎస్‌ఎంఈ) కలిసి పని చేసే ప్రణాళికల్లో ఉంది. తమ ‘వృద్ధి’ ప్రోగ్రాం కింద వచ్చే మూడేళ్లలో భారత్‌లో తమ సరఫరా వ్యవస్థలో మరో లక్ష ఎంఎస్‌ఎంఈలను భాగం చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం చిన్న సంస్థల కార్యకలాపాల విస్తరణకు తోడ్పడే ఐడియాస్‌ టు ఇంపాక్ట్‌ ఫౌండేషన్‌ (ఐ2ఐ)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వాల్‌మార్ట్‌ ఇంటర్నేషనల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జేసన్‌ ఫ్రెమ్‌స్టాడ్‌ తెలిపారు.

ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్‌ మార్కెట్‌ప్లేస్‌ల ద్వారా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లతో చిన్న సంస్థలను అనుసంధానం చేస్తున్నట్లు చెప్పారు. వృద్ధి ప్రోగ్రాం ద్వారా కార్యకలాపాలను విస్తరించుకునేందుకు ఎంఎస్‌ఎంఈలకు అవసరమయ్యే నైపుణ్యాల్లో వాల్‌మార్ట్‌ మార్గదర్శకత్వం వహిస్తోంది. 2019లో ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు 70,000 ఎంఎస్‌ఎంఈలకు శిక్షణనిచ్చినట్లు ఫ్రెమ్‌స్టాడ్‌ వివరించారు. 

ఇదీ చదవండి: ‘రేర్‌ ఎర్త్‌’ రీసైక్లింగ్‌పై రూ.100 కోట్ల పెట్టుబడులు

వృద్ధి ప్రోగ్రాం విజయవంతం కావడంతో మెక్సికో, అమెరికాలో కూడా వాల్‌మార్ట్‌ ఇదే తరహా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. గత 25 ఏళ్లుగా భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న వాల్‌మార్ట్‌ రెండు దశాబ్దాల్లో సుమారు 30 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ఆహారోత్పత్తులు, ఫార్మా, సైకిళ్లు మొదలైనవి కొనుగోలు చేసింది.
 

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)