Breaking News

గుండెకు గుండె! వినూత్న పరికరం ఆవిష్కరణ

Published on Fri, 12/05/2025 - 13:59

హైదరాబాద్: ఇటీవల గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. వయసుతో సంబంధం లేకుండా అందరిలోనూ గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. ఈనేపథ్యంలో ప్రతిఒక్కరు ముఖ్యంగా హృద్రోగ ముప్పు ఉన్నవారు తమ గుండె పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవడం అవసరం. ఇందు కోసమే ‘వికార్డియో’ అనే పరికరాన్ని ఆవిష్కరించింది మెడ్‌టెక్‌ సంస్థ వి టైటాన్ కార్పొరేషన్.

ఏఐ సాంకేతికతతో పనిచేసే ఈ సింగిల్-లీడ్ వేరబుల్ కార్డియాక్ మానిటర్.. పూర్తిగా భారతదేశంలోనే తయారైంది. దీంతో పూర్తిగా స్థానిక హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, క్లౌడ్-ఆధారిత ఏఐ అనలిటిక్స్‌తో ఇలాంటి పరికరం రూపొందించిన మొట్టమొదటి దేశీయ కంపెనీగా విటైటాన్‌ నిలిచింది. హృద్రోగ ముప్పులను ముందుగానే గుర్తించేందుకు గుండె ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించే స్మార్ వ్యవస్థగా వికార్డియో పరికరం రూపొందింది.

పనిచేస్తుందిలా..

వికార్డియో.. గుండెపై ఛాతీ భాగంలో అతికించుకునే తేలికపాటి, కాంపాక్ట్, కార్డియో మానిటర్. బ్లూటూత్ ద్వారా వికార్డియో మొబైల్ యాప్‌తో అనుసంధానమై పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు ఈసీజీలను మొబైల్‌ యాప్‌నకు పంపుతుంది. ఇందులో జోడించిన ఏఐ సామర్థ్యాలు 20 కంటే పైగా వైద్యపరంగా ముఖ్యమైన అరిథ్మియాలను (హృదయ పనితీరులో వ్యత్యాసాలు) రియల్‌ -టైమ్‌లో గుర్తించి వర్గీకరిస్తాయి. వాటికి సంబంధించిన స్నాప్ షాట్ లను పంపుతాయి. దీంతో సత్వరం చికిత్స అందించేందుకు వైద్యులకు కూడా సహాయకరంగా ఉంటుంది.

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)