Breaking News

భారత్‌లో స్వీడిష్ బ్రాండ్ కారు లాంచ్: ధర ఎంతంటే?

Published on Sun, 09/28/2025 - 15:33

స్వీడిష్ కార్ల తయారీ సంస్థ వోల్వో (Volvo).. ఇండియన్ మార్కెట్లో ఈఎక్స్30 (EX30) లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కారు ధర రూ. 41 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే ఈ కారును అక్టోబర్ 19 కంటే ముందుగా బుక్ చేసుకున్నవారికి కంపెనీ దీనిని రూ. 39.99 లక్షల (ఎక్స్ షోరూమ్) ధరకే అందిస్తుంది.

కొత్త వోల్వో ఈఎక్స్30 ఎలక్ట్రిక్ కారు.. క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్, స్లిమ్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, డేటైమ్ రన్నింగ్ లైట్స్, రియర్ లైట్స్ వంటి వాటితో పాటు.. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఏరోడైనమిక్ వీల్స్ వంటివి పొందుతుంది. ఛార్జింగ్ పోర్ట్ వెనుక ఎడమ క్వార్టర్ ప్యానెల్‌పై ఉంది.

మంచి ఇంటీరియర్ డిజైన్ కలిగిన ఈ కారు..  వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేతో పాటు గూగుల్ బేస్డ్ సిస్టమ్‌తో పనిచేసే 12.3-ఇంచెస్ వర్టికల్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను పొందుతుంది. డాష్‌బోర్డ్ స్ట్రీమ్‌లైన్డ్ డ్రైవర్ ఇంటర్‌ఫేస్, స్టీరింగ్ వీల్ కోసం కొత్త డిజైన్ పొందుతుంది. అంతే కాకుండా 360-డిగ్రీ కెమెరా, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, లేన్ కీపింగ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల వంటి ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఈ కారులో ఉన్నాయి.

ఇదీ చదవండి: తగ్గిన ధరలు: కొత్త రేట్లు ప్రకటించిన టీవీఎస్

భారతీయ మార్కెట్ కోసం లాంచ్ అయిన కొత్త వోల్వో ఈఎక్స్30 ఎలక్ట్రిక్ కారులో 69 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక ఛార్జ్‌పై 480 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 272 హార్స్ పవర్, 343 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 180 కిమీ/గం కాగా.. ఇది 5.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)