Breaking News

ఒకసారి చార్జింగ్‌తో 530 కిలోమీటర్లు ప్రయాణం

Published on Thu, 06/15/2023 - 04:59

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న స్వీడన్‌ సంస్థ వోల్వో తాజాగా భారత మార్కెట్లో పూర్తి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ సీ40 రీచార్జ్‌ ఆవిష్కరించింది. ఒకసారి చార్జింగ్‌తో 530 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. ట్విన్‌ మోటార్స్, 408 హెచ్‌పీ పవర్‌తో 78 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ పొందుపరిచారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 4.8 సెకన్లలో చేరుకుంటుంది. 27 నిమిషాల్లో 80 శాతం చార్జింగ్‌ పూర్తి అవుతుంది.

కారుకు కావాల్సిన విడిభాగాలను భారత్‌కు దిగుమతి చేసుకుని బెంగళూరు ప్లాంటులో అసెంబుల్‌ చేస్తారు. సెప్టెంబర్‌ నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయి. ఎలక్ట్రిక్‌ విభాగంలో భారత్‌లో సంస్థకు ఇది రెండవ మోడల్‌. ఇప్పటికే ఇక్కడి విపణిలో పూర్తి ఎలక్ట్రిక్‌ ఎక్స్‌సీ40 రీచార్జ్‌ కారును గతేడాది ప్రవేశపెట్టింది. అంతర్జాతీయంగా 2030 నాటికి పూర్తి ఎలక్ట్రిక్‌ కార్‌ కంపెనీగా అవతరించాలన్నది వోల్వో లక్ష్యం. భారత్‌లో 2025 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించింది.  (అపుడు పాల ప్యాకెట్‌ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!)



ఈవీలదే కీలక పాత్ర..
వోల్వో 2022లో దేశవ్యాప్తంగా సుమారు 1,800 యూనిట్లను విక్రయించింది. ఇప్పటి వరకు కంపెనీ నుంచి గరిష్టంగా 2018లో 2,600 కార్లు రోడ్డెక్కాయి. ఏటా ఇక్కడి మార్కెట్లో ఒక ఎలక్ట్రిక్‌ కారును ప్రవేశపెట్టాలని సంస్థ నిర్ణయించింది.  ఈ ఏడాది భారత్‌లో రికార్డు స్థాయిలో అమ్మకాలు సాధించే ప్రయత్నంలో ఎలక్ట్రిక్‌ కార్లు కీలక పాత్ర పోషిస్తాయని వోల్వో కార్‌ ఇండియా ఎండీ జ్యోతి మల్హోత్రా తెలిపారు. ‘2023 చాలా ఆశాజనకంగా ప్రారంభమైంది. (MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్‌ఎఫ్‌ సక్సెస్‌ జర్నీ)

గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే 2023లో మరింత మెరుగ్గా రాణిస్తామని నమ్ముతున్నాం. మహమ్మారి కారణంగా మార్కెట్‌ కొంచెం నెమ్మదిగా ఉంది. అలాగే సరఫరా సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ సమస్య ఇప్పటికీ ఉంది. గరిష్ట స్థాయి అమ్మకాలను సాధించిన 2018 స్థాయికి ఈ ఏడాది చేరుకుంటాం. మొత్తం విక్రయాల్లో ఈవీల వాటా 27 శాతం ఉంది’ అని వివరించారు. కంపెనీ భారత్‌లో ఎక్స్‌సీ90, ఎక్స్‌సీ60, ఎక్స్‌సీ40 ఎస్‌యూవీలు, ఎస్‌90 సెడాన్‌ను సైతం విక్రయిస్తోంది. 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు