2026 టైగన్ లాంచ్: ధర రూ.10.99 లక్షలు

Published on Wed, 04/15/2026 - 04:42

ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ తన టైగన్ ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లో రూ. 10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు విడుదల చేసింది. ఈ 2026 మోడల్ సాధారణ కారు కంటే కొంత భిన్నంగా ఉంటుంది.

కంఫర్ట్‌లైన్, హైలైన్, హైలైన్ ప్లస్, టాప్‌లైన్, జీటీ లైన్, జీటీ ప్లస్ క్రోమ్, జీటీ ప్లస్ స్పోర్ట్ అనే ఏడు ట్రిమ్‌లలో లభించే టైగన్ కారు కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ పొందుతుంది. 2021లో దేశీయ విఫణిలో లాంచ్ అయిన టైగన్.. దాదాపు ఐదేళ్లకు ఫేస్‌లిఫ్ట్‌ రూపంలో అడుగుపెట్టింది. ఈ ఎస్‌యూవీలోని కొత్త హెడ్‌లైట్స్.. ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లతో అనుసంధానం అయింది. గ్రిల్ డిజైన్ కూడా అప్‌డేట్ అయింది. వెనుక భాగంలో టెయిల్‌లైట్లు, నలుపు రంగులో ఉన్న టైగన్ లోగో పొందుతుంది.

పనితీరు పరంగా చూస్తే.. కొత్త వోక్స్‌వ్యాగన్ టైగన్ 114 హార్స్ పవర్, 178 న్యూటన్ మీటర్ టార్క్‌ ఉత్పత్తి చేసే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ లభిస్తుంది. మునుపటి 6-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్‌ స్థానంలో కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్‌ను చేర్చారు. 147 హార్స్ పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ అందించే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ కూడా ఈ తాజా మోడల్‌లో అందుబాటులో ఉంది.

కొత్త టైగన్ అవకాడో పెర్ల్, స్టీల్ గ్రే రంగులలో లభిస్తుంది. దీంతో మొత్తం 9 రంగుల ఎంపికలు అందుబాటులోకి వచ్చింది. ఇది 10.09-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ పొందుతుంది. ఇది 15 విభిన్న అప్లికేషన్‌లను ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అంతే కాకుండా.. ఇందులో కొత్త 9 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ క్లస్టర్ కూడా ఉంది, ఇది మీకు టర్న్ బై టర్న్ నావిగేషన్‌ను కూడా అందిస్తుంది.

Videos

మంత్రాలయం రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా.. అనవసర అరెస్టులు, రిమాండ్లు..

బైక్ ను 100 స్పీడ్ లో నడుపుతూ రీల్ చేద్దామనుకున్నారు.. కట్ చేస్తే.. రికార్డైన వీడియోలో..!

మీకంత దైర్యం ఉంటే.. మీడియా ముందుకు వచ్చి చెప్పండి..

తేల్చుకుందాం.. ఆ నొప్పి ఎలా ఉంటదో చూపిస్తాం.. చెవిరెడ్డి మాస్ వార్నింగ్

విద్యలోకి రాజకీయాలు? స్కూల్ పేపర్ లో లడ్డు కల్తీ ప్రశ్న

జగనన్న కోసం పని చేస్తున్నందుకు నా జన్మ ధన్యం అయింది.. పొన్నవోలు ఎమోషనల్

డబుల్ ధమాకా..! ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు

టీడీపీ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ పై పేర్ని నాని, వల్లభనేని వంశీ ఫిర్యాదు

ఫిషింగ్ హార్బర్లపై హక్కు మత్స్యకారులదే.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

Photos

+5

వైట్‌ డ్రెస్‌ ఔట్‌ఫిట్‌లో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

మహేశ్‌బాబు బ్యానర్‌ సినిమా ‘రావు బహదూర్‌’.. సాంగ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఆర్య కొత్త సినిమా.. ‘మిస్టర్‌ ఎక్స్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

‘శ్రీనివాస మంగాపురం’ మూవీ HD స్టిల్స్

+5

‘పాపం ప్రతాప్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు రామ్ చరణ్.. ప్రముఖ మ్యాగజైన్‌పై గ్లోబల్ స్టార్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సినీ, క్రీడా ప్రముఖులు (ఫొటోలు)

+5

మత్స్యకారులతో వైఎస్‌ జగన్‌ మమేకం (ఫొటోలు)

+5

తిరుమలలో పండగ సెలబ్రేట్ చేసుకున్న సంయుక్త (ఫొటోలు)

+5

మెరిసిపోతున్న నభా నటేశ్ (ఫొటోలు)