Breaking News

ఇండియన్‌ మార్కెట్‌లో ఫోక్స్‌ వ్యాగన్‌ టైగున్‌ ఎస్‌యూవీ

Published on Fri, 09/24/2021 - 11:33

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీలో ఉన్న జర్మనీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌ ప్యాసింజర్‌ కార్స్‌ ఇండియా తాజాగా సరికొత్త టైగున్‌ ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేసింది. ఆఫర్‌లో ధర ఎక్స్‌షోరూంలో రూ.10.49 లక్షల నుంచి రూ.17.49 లక్షల మధ్య ఉంది.

పెట్రోల్‌ ఇంజన్‌తో 1 లీటర్, 1.5 లీటర్‌ మాన్యువల్, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో తయారైంది. ఇప్పటికే 12,200 పైచిలుకు బుకింగ్స్‌ నమోదయ్యాయని కంపెనీ తెలిపింది. హ్యూండాయ్‌ క్రెటా, కియా సెల్టోస్‌కు ఇది పోటీ ఇవ్వనుంది. ఫోక్స్‌వ్యాగన్‌ ఇండియా 2.0 ప్రాజెక్ట్‌లో టైగున్‌ తొలి ఉత్పాదన. మధ్యస్థాయి ఎస్‌యూవీ విభాగంలో దేశంలో అన్ని బ్రాండ్లవి కలిపి ఏటా 4 లక్షల యూనిట్లు అమ్ముడవుతున్నాయని కంపెనీ బ్రాండ్‌ డైరెక్టర్‌ ఆశిష్‌ గుప్తా తెలిపారు.

‘వినియోగదార్లకు ఎంపిక పరిమితమైంది. రెండు సంస్థలదే ఈ విభాగంలో ఆధిపత్యం. అందుకే టైగున్‌ను ప్రవేశపెట్టాం. మధ్యస్థాయి ఎస్‌యూవీ విభాగంలో వచ్చే ఏడాది నుంచి 10% వాటా చేజిక్కించుకోవాలన్నది మా లక్ష్యం. కొత్త విభాగాలు, కొత్త అవకాశాలపై దృష్టిసారించాల్సిన సమయం వచ్చింది’ అన్నారు.  
 

చదవండి: టెస్లా ఎలక్ట్రిక్‌ కారుకి ఇండియాలో అడ్డం పడుతున్న ‘స్పీడ్‌ బ్రేకర్‌’

Videos

మహిళల సింధూరాన్ని చెరిపినవారిని మట్టిలో కలిపేశాం : మోదీ

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)