Breaking News

365 రోజుల వ్యాలిడిటీ: వోడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్

Published on Sun, 05/18/2025 - 21:08

జియో, ఎయిర్‌టెల్‌ వంటి టెలికాం కంపెనీలు సరసమైన రీఛార్జ్ ప్లాన్స్ పరిచయం చేస్తుంటే.. దేశంలో మూడవ అతిపెద్ద టెలికాం ప్రొవైడర్ అయిన వోడాఫోన్ ఐడియా మాత్రం ఖరీదైన ప్లాన్ (రూ. 4999) ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ఖరీదైనది అయినప్పటికీ.. ఆఫర్స్ కూడా బోలెడన్ని ఉన్నాయని తెలుస్తోంది.

వోడాఫోన్ ఐడియా తీసుకొచ్చిన లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్ రూ.4,999 వ్యాలిడిటీ.. 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. తరచుగా రీఛార్జ్ చేసుకునే ఇబ్బందిని తొలగించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా ఏడాది పాటు.. రోజుకి 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపుకోవచ్చు. అయితే డేటా రోజుకు 2 జీబీ మాత్రమే. అపరిమిత వాయిస్ కాల్స్ యధావిధిగా లభిస్తాయి.

ఎస్‌ఎమ్‌ఎస్‌లు, డేటా, వాయిస్ కాల్స్ మాత్రమే కాకుండా.. Vi MTV, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ లివ్, జీ5, ప్లేఫ్లిక్, Fancode, Aaj Tak, Manoramax వంటి అనేక ఇతర OTT ప్లాట్‌ఫామ్‌లకు ఉచిత సభ్యత్వాలు లభిస్తాయి.

వోడాఫోన్ ఐడియా రూ. 4999 ప్లాన్ అపరిమిత ప్రయోజనాల విషయానికి వస్తే.. ఇందులో వీకెండ్ డేటా రోల్‌ ఓవర్, డేటా డిలైట్స్, హాఫ్ డే అన్‌లిమిటెడ్ డేటా వంటివి ఉన్నాయి. రోజుకి 2జీబీ డేటా అయినప్పటికీ హాఫ్ డే అన్‌లిమిటెడ్ డేటా కింద.. ప్రతిరోజూ అర్ధరాత్రి నుండి మధ్యాహ్నం వరకు అపరిమిత డేటా అందుబాటులో ఉంటుంది. ఇది సగం రోజు వినియోగాన్ని కవర్ చేస్తుంది. ఈ ప్లాన్ వారాంతపు డేటా రోల్‌ఓవర్‌ను కూడా కలిగి ఉంది, అంటే ఉపయోగించని ఇంటర్నెట్ డేటాను వారంలోని చివరి రెండు రోజుల్లో తీసుకెళ్లి ఉపయోగించవచ్చు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)