Breaking News

సరికొత్త రీఛార్జ్ ప్లాన్.. అదిరిపోయే ఆఫర్స్: రూ. 209తో..

Published on Wed, 01/15/2025 - 20:33

జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు యూజర్లను ఆకర్షిస్తున్న వేళ.. 'వోడాఫోన్ ఐడియా' (VI) వినియోగదారుల కోసం ఓ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ ధర రూ. 209 మాత్రమే. 28 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ అన్ని రకాలుగా చాలా ఉపయోగకరంగా ఉంటుందని సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

వోడాఫోన్ ఐడియా అందిస్తున్న 209 రూపాయల ప్లాన్ అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందించడం మాత్రమే కాకుండా, రోజుకు 2జీబీ డేటా అందిస్తుంది. అంతే కాకుండా 300 ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో అందించే ప్రయోజనాలు రూ.199 ప్లాన్‌కు సమానంగా ఉంటాయి. అయితే ఈ రెండింటి మధ్య ఉన్న ఒకే ఒక్క తేడా ఏమిటంటే.. రూ.209 ప్లాన్‌లో కంపెనీ అపరిమిత కాలర్ ట్యూన్‌లను అందిస్తోంది. రూ. 209 ప్లాన్ కాకుండా.. కంపెనీ రూ. 218, రూ. 249, రూ. 289 ప్లాన్స్ కూడా అందిస్తోంది.

రూ. 218 ప్లాన్
కంపెనీ రూ.218 ప్లాన్ ద్వారా 1 నెల వాలిడిటీ పొందవచ్చు. ఈ ప్లాన్‌లో, మీరు ఇంటర్నెట్ వినియోగం కోసం మొత్తం 3జీబీ డేటాను పొందుతారు. డేటా పరిమితి ముగిసిన తర్వాత, మీరు 1MB డేటా కోసం 50 పైసలు చెల్లించాలి. ప్లాన్‌లో.. కంపెనీ అపరిమిత కాలింగ్, 300 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లను అందిస్తోంది. 300 ఎస్‌ఎమ్‌ఎస్‌ల పరిమితి ముగిసిన తర్వాత.. ఒక్కో లోకల్ ఎస్‌ఎమ్‌ఎస్‌ కోసం రూ.1, ఎస్‌టీడీ ఎస్‌ఎమ్‌ఎస్‌ కోసం రూ. 1.5 పైసలు చెల్లించాల్సి వస్తుంది.

రూ. 249 ప్లాన్‌
కంపెనీ అందించే.. ఈ ప్లాన్ వాలిడిటీ 24 రోజులు. దీని ద్వారా మీరు ఇంటర్నెట్ వినియోగం కోసం ప్రతిరోజూ 1 జీబీ డేటా పొందవచ్చు. డేటా పరిమితి ముగిసిన తర్వాత, ప్లాన్‌లో అందించే ఇంటర్నెట్ వేగం 64Kbpsకి తగ్గుతుంది. ఈ ప్లాన్‌లో కంపెనీ ప్రతిరోజూ 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను అందిస్తోంది. దీనితో పాటు, మీరు అపరిమిత కాలింగ్ కూడా పొందుతారు.

రూ. 289 ప్లాన్
ఈ ప్లాన్ ద్వారా మీరు 40 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. 4 జీబీ డేటా లభిస్తుంది. డేటా పరిమితి ముగిసిన తర్వాత, మీరు 1MB డేటా కోసం 50 పైసలు చెల్లించాలి. ఈ ప్లాన్ 600 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు, అపరిమిత కాలింగ్ ప్రయోజనాలు లభిస్తాయి.

ఇదీ చదవండి: ఒక్క రీఛార్జ్‌తో 84 రోజులు - బెస్ట్ ప్లాన్ చూడండి

మొబైల్‌ రీఛార్జ్‌ మరింత భారం అవుతుందా?
రిలయన్స్ జియో(Jio), భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియా సహా భారతదేశంలోని టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది టారిఫ్‌(Tariff)లను 10 శాతం పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో 2024 జులైలో 25 శాతం వరకు టారిఫ్ పెంచిన విషయం తెలిసిందే. ఆపరేటర్లు మార్జిన్లపై దృష్టి పెడుతున్నారని, త్వరలో 5జీ నిర్దిష్ట ధరలను ప్రవేశపెట్టవచ్చని జెఫరీస్ నివేదిక తెలిపింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)