Breaking News

వొడాఫోన్‌ ఐడియా నష్టాలు తగ్గాయ్‌

Published on Thu, 11/14/2024 - 12:46

న్యూఢిల్లీ: మొబైల్‌ టెలికం దిగ్గజం వొడాఫోన్‌ ఐడియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో కన్సాలిడేటెడ్‌ నికర నష్టం తగ్గి రూ. 7,176 కోట్లకు పరిమితమైంది. జులైలో టారిఫ్‌ల పెంపు చేపట్టడంతో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) మెరుగుపడటం ఇందుకు దోహదపడింది.

గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 8,747 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం 2 శాతం స్వల్ప వృద్ధితో రూ. 10,932 కోట్లను అధిగమించింది. గత క్యూ2లో రూ. 10,716 కోట్ల టర్నోవర్‌ సాధించింది. ఏఆర్‌పీయూ 8 శాతం పుంజుకుని రూ. 166ను తాకింది. మొత్తం వినియోగదారుల సంఖ్య 20.5 కోట్లకు చేరింది.

ఇదీ చదవండి: రూ.6కే అన్‌లిమిటెడ్‌.. బీఎస్‌ఎన్‌ఎల్‌లో బెస్ట్‌ ప్లాన్‌

కాగా.. మూడేళ్ల కాలంలో నెట్‌వర్క్‌ పరికరాల సరఫరా కోసం నోకియా, ఎరిక్‌సన్, శామ్‌సంగ్‌లతో 3.6 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 30,000 కోట్లు) విలువైన కాంట్రాక్టులు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. లితాల నేపథ్యంలో వొడాఫోన్‌ ఐడియా షేరు బీఎస్‌ఈలో 4 శాతం క్షీణించి రూ. 7.37 వద్ద ముగిసింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)