Breaking News

వొడాఫోన్‌ ఐడియా షేర్ల జారీ

Published on Wed, 12/11/2024 - 08:05

న్యూఢిల్లీ: మొబైల్‌ టెలికం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా ప్రిఫరెన్షియల్‌ ప్రాతిపదికన 175.53 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఇందుకు బోర్డు అనుమతించినట్లు కంపెనీ వెల్లడించింది. షేరుకి రూ. 11.28 ధరలో వొడాఫోన్‌ గ్రూప్‌ సంస్థలకు వీటిని కేటాయించనుంది. తద్వారా రూ. 1,980 కోట్లు సమకూర్చుకోనుంది. ఒమెగా టెలికం హోల్డింగ్స్‌కు రూ. 1,280 కోట్లు, ఉషా మార్టిన్‌ టెలిమాటిక్స్‌కు రూ. 700 కోట్లు విలువైన షేర్లను జారీ చేయనుంది.

2025 జనవరి 7న నిర్వహించనున్న అసాధారణ సమావేశం(ఈజీఎం)లో ఈ అంశాలను బోర్డు చేపట్టనున్నట్లు కంపెనీ తెలియజేసింది. ప్రస్తుతం కంపెనీలో వొడాఫోన్‌ గ్రూప్‌ వాటా 22.56 శాతంకాగా.. ఆదిత్య బిర్లా గ్రూప్‌ 14.76 శాతం, కేంద్ర ప్రభుత్వం 23.15 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి. ఈ ఏడాది(2024–25) రెండో త్రైమాసికంలో కంపెనీ నికర నష్టం రూ. 8,747 కోట్ల నుంచి తగ్గి రూ. 7,176 కోట్లకు పరిమితమైంది. ఇందుకు ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) మెరుగుపడటం సహకరించింది.

మొత్తం ఆదాయం మాత్రం స్వల్పంగా 2 శాతం మెరుగుపడి రూ. 10,918 కోట్లను తాకింది. కాగా.. ఇటీవల టెలికం దిగ్గజాలు నోకియా, ఎరిక్‌సన్, శామ్‌సంగ్‌తో నెట్‌వర్క్‌ పరికరాల సరఫరా కోసం సుమారు రూ. 30,000 కోట్ల(3.6 బిలియన్‌ డాలర్లు) విలువైన డీల్‌ను వొడాఫోన్‌ ఐడియా కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఎన్‌ఎస్‌ఈలో వొడాఫోన్‌ ఐడియా షేరు రూ. 8.11 వద్ద ముగిసింది. 
 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)