Breaking News

Vodafone Idea: 6 నెలల్లో 5జీ సేవల విస్తరణ

Published on Tue, 04/16/2024 - 06:26

ముంబై:  టెలికం సంస్థ వొడాఫోన్‌ ఐడియా (వీఐ) ప్రతిపాదిత రూ. 18,000 కోట్ల ఎఫ్‌పీవో ద్వారా నిధులు సమీకరణ అనంతరం 6–9 నెలల్లోగా 5జీ సరీ్వసులు విస్తరించే యోచనలో ఉంది. నిధుల కొరత వల్లే ఇప్పటివరకు సర్వీసులను ప్రారంభించలేకపోయామని సంస్థ సీఈవో అక్షయ ముంద్రా తెలిపారు. రాబోయే 24–30 నెలల్లో తమ మొత్తం ఆదాయంలో 5జీ వాటా 40 శాతం వరకు ఉండగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఎఫ్‌పీవో ద్వారా సేకరించే నిధుల్లో రూ. 5,720 కోట్ల మొత్తాన్ని 5జీ సరీ్వసులకు వినియోగించనున్నట్లు ముంద్రా వివరించారు. వొడా–ఐడియా ఫాలో ఆన్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీవో) ఏప్రిల్‌ 18న ప్రారంభమై 22తో ముగియనుంది. ఇందుకోసం ధర శ్రేణిని షేరుకు రూ. 10–11గా నిర్ణయించారు. ఫాలో ఆన్‌ ఆఫర్‌ ద్వారా సేకరించే రూ. 18,000 కోట్లలో రూ. 15,000 కోట్ల మొత్తాన్ని 5జీ సేవల విస్తరణ, ఇతరత్రా పెట్టుబడుల కోసం వినియోగించుకోనున్నట్లు ముంద్రా వివరించారు.

ప్రధానంగా కస్టమర్లు చేజారి పోకుండా చూసుకోవడం, యూజరుపై సగటు ఆదాయాన్ని (ఆర్పూ) పెంచుకోవడం, నెట్‌వర్క్‌పై పెట్టుబడులు పెట్టడం తమకు ప్రాధాన్యతాంశాలుగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. 2జీ యూజర్లు ఎక్కువగా ఉన్నందున తమ ఆర్పూ మొత్తం పరిశ్రమలోనే తక్కువగా ఉంటుందని చెప్పారు. అయితే, ప్రస్తుతం తమ 21.5 కోట్ల యూజర్లలో కేవలం 2జీనే వినియోగించే వారి సంఖ్య 42 శాతంగా ఉంటుందని, వీరంతా 4జీకి అప్‌గ్రేడ్‌ అయ్యే అవకాశాలు ఉన్నందున ఆర్పూ మెరుగుపడేందుకు ఆస్కారం ఉందన్నారు.

Videos

నా చావుకు కారణం ఆ ముగ్గురే.! మాధురి రాథోడ్ లేఖ వైరల్..

కుప్పకూలిన భారీ భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?

ఎవడికీ భయపడాల్సిన పని లేదు... చంద్రబాబుకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

హే మిస్టర్.. దమ్ముంటే CBI ఎంక్వైరీ వేయ్..

ఒక్కడే ఒక సైన్యంలా.. కలుషిత నదికి ప్రాణం పోస్తున్న యువకుడు..!

నేను జగన్ చెంచాను అయితే.. నువ్వు చంద్రబాబు కు చెంచావా..?

హెరిటేజ్ లో పాలు అమ్మినట్టు.. టీచర్ పోస్టులను అమ్మేశారు

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

Photos

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)

+5

నిర్మాతల మండలి ఎన్నికలు..ఓటేసిన టాలీవుడ్‌ సెలెబ్రెటీలు (ఫోటోలు)

+5

ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 06 -సెప్టెంబర్ 12)

+5

'అంతా రాములోరు చూసుకుంటారు' మూవీ టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)