Breaking News

సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 250 కిమీ రేంజ్!

Published on Sun, 10/11/2026 - 16:54

వీఎల్ఎఫ్ ఇండియా, స్ట్రాడా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 1.20 లక్షలు. ఈ స్కూటర్ సిటీ, మాక్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 1.20 లక్షలు, రూ. 1.55 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది యమహా ఈసీ-06, సుజుకి ఈ-యాక్సెస్‌లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

వీఎల్ఎఫ్ స్ట్రాడా 4.8kW పవర్, 34 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే BLDC హబ్ మోటార్‌తో పనిచేస్తుంది. ఇది మూడు రైడింగ్ మోడ్‌లను అందిస్తుంది. ప్రతి మోడ్‌కు వేర్వేరు వేగ పరిమితి ఉంటుంది. ఎకో మోడ్‌లో 45kmph, సిటీ మోడ్‌లో 65kmph, స్పోర్ట్ మోడ్‌లో 85kmph.

సిటీ వేరియంట్‌లో 130 కిలోమీటర్ల వరకు ఐడీసీ రేంజ్ అందించడానికి 2.16kWh బ్యాటరీ ఉండగా, మ్యాక్స్ వేరియంట్‌లో 250 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వడానికి పెద్ద 4.32kWh బ్యాటరీ ఉంది. ఈ స్కూటర్‌లో రిమూవబుల్ బ్యాటరీ సదుపాయం కూడా ఉంది. నిర్దేశించిన ఛార్జింగ్ కాన్ఫిగరేషన్‌ను ఉపయోగించి స్కూటర్‌ను రెండు గంటల లోపు ఛార్జ్ చేయవచ్చు.

డిజైన్ విషయానికి వస్తే.. ఈ స్కూటర్ ముందు భాగంలో, స్ట్రాడా డ్యూయల్-బీమ్ ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ఉంది. టర్న్ ఇండికేటర్లు, ఎత్తైన టెయిల్ సెక్షన్, ఇంటిగ్రేటెడ్ లగేజ్ ర్యాక్ ఉన్నాయి. దీనికి పై ఫ్రంట్ కౌల్ నుంచి విస్తరించి ఉండే పొడవైన, పారదర్శకమైన విండ్‌స్క్రీన్ కూడా లభిస్తుంది. ఈ స్కూటర్‌లో సీటు ఎత్తు 780mm ఉంటుంది.

ఫీచర్ల జాబితాలో.. 5-అంగుళాల TFT డిస్‌ప్లే, కీలెస్‌ ఎంట్రీ, USB టైప్-ఏ, టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్‌లు ఉన్నాయి. స్ట్రాడా 16-అంగుళాల ముందు చక్రం, 14-అంగుళాల వెనుక చక్రంపై నడుస్తుంది. బ్రేకింగ్ అనేది కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS)తో కూడిన డిస్క్ బ్రేక్ సెటప్. ఈ స్కూటర్ కార్బోనియో బ్లాక్, అర్బానో సిల్వర్, టైటానియో గ్రే, లూనా వైట్ అనే నాలుగు రంగుల్లో లభిస్తుంది.

Videos

టీడీపీ నుండి YSRCP లోకి చేరిన వెంటనే వరాలు కురిపించిన రాచమల్లు

హీరోగా విజయ్ వారసుడు

నవరాత్రుల వేళ ఇదేం అపచారం..! పూజలు లేకుండానే అమ్మవారి నిమజ్జనం

5 నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది.. మేడ్చల్ బాలిక కేసులో షాకింగ్ నిజాలు..

నాడు తిట్లు.. నేడు ప్రశంసలు 'ది హిందూ'లో మోదీపై చంద్రబాబు ప్రేమలేఖ

మూఢ నమ్మకంతో డీజిల్ పోసి తల్లినే చంపిన కొడుకు

పుష్ప శ్రీవాణి సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

దుర్గ గుడిలో సౌకర్యాలపై కేశినేని చిన్ని ని కడిగిపారేసిన భక్తులు

బాహుబలి కిలికి భాష గుర్తుందా..! వారణాసిలో అంతకు మించి..!

అరెస్ట్ చేయలేదు.. నన్ను కిడ్నాప్ చేశారు.. ధృవ్ రాఠీ సంచలన వీడియో

Photos

+5

ఇంద్రకీలాద్రిపై తొలిరోజు (ఫొటోలు)

+5

మల్లెపూలతో మెస్మరైజ్ చేస్తోన్న మంగళవారం బ్యూటీ.. (ఫోటోలు)

+5

రంభ ఊర్వశి మేనక బ్యూటీ రాశి సింగ్ లేటెస్ట్ పిక్స్.. (ఫోటోలు)

+5

రైళ్లు కిటకిట (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా రవితేజ కొత్త సినిమా తులాభారం ప్రారంభం.. (ఫోటోలు)

+5

హైదరాబాద్ : డ్యాన్స్‌తో అదరగొట్టిన విద్యార్థులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ షాన్-ఎ-దక్కన్ కార్ ర్యాలీ ప్రారంభించిన నటుడు సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

హీరో విజయ్ దేవరకొండ (ఫోటోలు)

+5

అందాల అర్చన.. ఆకట్టుకుందిలా.. (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 11 -అక్టోబర్ 17)