Breaking News

స్పిరిట్‌ కంపెనీలో వివేక్‌ ఒబెరాయ్‌ పెట్టుబడి

Published on Fri, 05/23/2025 - 13:24

ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ స్కాటిష్ బ్రాండ్ రట్ ల్యాండ్ స్క్వేర్ స్పిరిట్స్ లిమిటెడ్‌లో 21 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే అందుకు ఎంతమేర డబ్బు వెచ్చించారనే విషయాలు వెల్లడికాలేదు. ఈ డీల్‌తోపాటు ఒబెరాయ్ ఎడిన్‌బర్గ్‌లో నెట్ జీరో ఉద్గారాలతో లగ్జరీ హోటల్‌ను అభివృద్ధి చేస్తున్నారు.

ఐరోపాలో మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత సౌకర్యాలతో భారతీయ వారసత్వం తలిపించేలా, స్కాటిష్ సంప్రదాయాలను మిళితం చేస్తూ ఎడిన్‌బర్గ్‌లో హోటల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇది స్కాట్‌లాండ్‌లో తొలి ఆయుర్వేద వెల్‌నెస్‌ సెంటర్‌గా గుర్తింపు పొందనుందని అధికారులు చెబుతున్నారు. రట్‌లాండ్‌ స్క్వేర్ స్పిరిట్స్ లిమిటెడ్ దాని టీఇన్‌ఫ్యూజ్డ్‌ జిన్ తయారీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

ఇదీ చదవండి: ఉద్యోగం ఊడింది.. మంచికే అయింది!

ఈ సందర్భంగా పెట్టుబడుల గురించి ఒబెరాయ్ మాట్లాడుతూ.. భారతదేశం, స్కాట్‌లాండ్‌ మధ్య సంబంధాలను పెంపొందించడాన్ని హైలైట్ చేశారు. యూకేలో బలమైన భారతీయ వ్యాపార కమ్యూనిటీ ఉందని నొక్కి చెప్పారు. లోతైన ఆర్థిక, సాంస్కృతిక సహకారానికి ఇరు ప్రాంతాల మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)